Advertisement

బిజెపి లో చేరి..తప్పు చేశామనుకుంటున్నారు!

Thu 14th Jul 2016 11:17 AM
bjp,congress,kavuri sambasivarao,purandeswari,kanna lakshminarayana,no importance  బిజెపి లో చేరి..తప్పు చేశామనుకుంటున్నారు!
బిజెపి లో చేరి..తప్పు చేశామనుకుంటున్నారు!
Advertisement

కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ మాటను కాదని రాష్ట్రాన్ని రెండుగా విడగొట్టిన నేపథ్యంలో ఇక ఏపీలో కాంగ్రెస్‌కు భవిష్యత్తులేదని భావించిన ఆ పార్టీ కేంద్ర, రాష్ట్ర మంత్రుల్లో కొందరు అటు టిడిపిలోనూ, ఇటు వైయస్సార్‌సీపీలోనూ చేరడానికి మనస్కరించని పరిస్దితుల్లో వారు బిజెపి తీర్దం పుచ్చుకున్నారు. వారిలో కేంద్రమంత్రులైన దగ్గుబాటి పురందేశ్వరి, కావూరి సాంబశివరావు, కన్నాలక్ష్మీనారాయణ వంటి వారు ఉన్నారు. ఒకప్పుడు చక్రం తిప్పిన ఈ నేతలు బిజెపిలో చేరిన తర్వాత నామమాత్రంగా మిగిలిపోయారు. వారికి పార్టీలో సరైన ప్రాధాన్యత లభించడంలేదు. చంద్రబాబుపై విరుచుకుపడాలని భావిస్తే బిజెపి అధిష్టానం వీరి ఆశలపై నీళ్లు చల్లుతోంది. పోనీ పార్టీలో కీలకపదవులైనా ఇస్తారనుకుంటే బిజెపి అధిష్టానం మాత్రం వారికి ప్రాధాన్యం ఇవ్వడంలేదు. కీలకపదవుల్లో ఆరెస్సెస్‌కు చెందిన, ఇంతకాలం బిజెపిని నమ్ముకొని ఉన్న నాయకులకే వారు ప్రాధాన్యం ఇస్తున్నారు. కాంగ్రెస్‌లోలాగా పార్టీమారిన ముఖ్యనేతలకు బిజెపిలో పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. వారిని నెత్తినపెట్టుకోరు. ఇది బిజెపి సిద్దాంతం. దీంతో పార్టీ మారి బిజెపిలో చేరిన పురందేశ్వరి, కావూరి, కన్నా వంటి వారికి అసలు రాష్ట్రంలో ప్రాధాన్యమే ఇవ్వకపోవడంతో ఈ నేతలకు దిక్కుతోచడం లేదు. దీంతో వారు కేవలం తమ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది అనే మాటలు చెప్పుకోవడం తప్ప తమకు ఏమీ పనిలేకుండా పోయిందని మదనపడుతున్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement