Advertisementt

ముందు అజిత్..తర్వాత పవన్‌, వెంకటేష్‌!

Wed 13th Jul 2016 07:21 PM
pawan kalyan,venkatesh,peppar salt hair style,ajith  ముందు అజిత్..తర్వాత పవన్‌, వెంకటేష్‌!
ముందు అజిత్..తర్వాత పవన్‌, వెంకటేష్‌!
Advertisement
Ads by CJ

సౌత్‌లో అజిత్‌తో మొదలైన పెప్పర్‌సాల్ట్‌ హెయిర్‌స్టైల్‌ను తాజాగా పవన్‌.. తను డాలీ తో చేయబోతున్న చిత్రంలో ఫాలో అవుతున్న విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్‌లో పవన్‌ చేయనున్న పెప్పర్‌సాల్ట్‌ హెయిర్‌స్టైల్‌ను ఇప్పుడు విక్టరీ వెంకటేష్‌ కూడా ఫాలో అవుతున్నాడు. ప్రస్తుతం వెంకటేష్‌ మారుతి దర్శకత్వంలో 'బాబు బంగారం' చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత ఆయన హిందీలో మాధవన్‌ హీరోగా పెద్ద విజయం సాధించిన 'సాలా ఖుద్దూస్‌' చిత్రం రీమేక్‌లో నటించనున్నాడు. ఈ చిత్రంలో మాధవన్‌ ఓ రిటైర్డ్‌ బాక్సర్‌గా కనిపిస్తాడు. ఓ రిటైర్డ్‌ బాక్సర్‌ తన అనుభవంతో ఓ వ్యక్తిని బాక్సింగ్‌ చాంపియన్‌ చేయడం ఈ చిత్రం కథ. అయితే ఈ చిత్రానికి తెలుగు బేస్డ్‌ దర్శకురాలు సుధాకొంగర దర్శకత్వం వహించింది. ఈ వెంకీ రీమేక్‌కు కూడా ఆమే దర్శకత్వం వహించనుందని సమాచారం. ఈ చిత్రం కోసం వెంకీ భారీ దేహంతో కనిపించాల్సివుంది. ప్రస్తుతం ఆ పనిలో వెంకీ బిజీగా ఉన్నాడు. తెలుగులో ఈ చిత్రాన్ని వైనాట్‌ ఫిల్మ్స్‌తో కలిసి సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్ధ నిర్మించనుంది. ఈచిత్రంలో వెంకీ హెయిర్‌స్టైల్‌ పెప్పర్‌ సాల్ట్‌ లుక్‌లో ఉండనుంది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ