నాగార్జునకు కోపం వచ్చింది!!

Wed 13th Jul 2016 07:00 PM
nagarjuna,annapurna studios,namo venkatesaya,s.gopala reddy,k.raghavendra rao,nagarjuna angry,nagarjuna fans  నాగార్జునకు కోపం వచ్చింది!!
నాగార్జునకు కోపం వచ్చింది!!
Advertisement
Ads by CJ

సౌమ్యుడిగా పేరున్న నాగార్జునకు కోపం వచ్చింది. ఒక్కసారిగా ఆయన ముఖకవళికలు మారాయి. తన స్టాఫ్ పై అరిచారు. ఆవేశంలో ఉండగానే వచ్చిన అభిమానులపై ఆగ్రహించారు. ఈ సీనంతామంగళవారం అన్నపూర్ణ స్టూడియోలో కనిపించింది. 

కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తున్న 'ఓం నమో వెంకటేశ' చిత్రంలో భక్తుడిగా నాగార్జున నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియో ఫ్లోర్ల లో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో షూటింగ్ చేస్తున్నారు. 

భక్తుడి గెటప్ లో ఉన్న నాగార్జునపై కెమెరామెన్ ఎస్. గోపాలరెడ్డి ఆధ్వర్యంలో పాట చిత్రీకరణ జరుగుతుండగా నాగార్జున మూడ్ మారిందట. విసురుగా సెట్ నుండి బయటకు వచ్చేసి అటూ ఇటూ కొద్దిసేపు తిరిగారు. అప్పుడే ఆయనను కలవడానికి అభిమానులు వచ్చారు. ఒకేసారి ఎక్కువమంది కనిపించడంతో అప్పటికే మూడ్ మారి ఉన్న నాగ్ వారిపై ఆగ్రహించారని తెలిసింది. దీంతో వారంతా బిక్కుబిక్కుమన్నారు. అయితే కొద్ది క్షణాల తర్వాత అభిమానులను దగ్గరకు పిలిచి మాట్లాడారని సమాచారం. 

నాగ్ మూడ్ మారడానికి కారణం ఏమై ఉంటుంది?. కె.రాఘవేంద్రరావు సినిమా అంటే అంతా సాఫీగా జరుగుతుంది. పైగా భక్తి చిత్రం కాబట్టి సెట్ అంతా కూల్ గా ఉంది. యూనిట్ అంతా డ్రస్ కోడ్ పాటిస్తూ, భక్తితో పనిచేస్తున్నారు. అయినప్పటికీ నాగ్  మూడ్ మారడానికి కారణం కుటుంబపరంగా ఉన్న సమస్యలే  అని సన్నిహితులు అనుమానిస్తున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ