Advertisement

వెంకయ్య నాయుడును కాదనే దమ్ముందా?

Tue 12th Jul 2016 08:30 PM
venkayya naidu,bjp president in andhra pradesh,somu verraju,haribabu,srinivas  వెంకయ్య నాయుడును కాదనే దమ్ముందా?
వెంకయ్య నాయుడును కాదనే దమ్ముందా?
Advertisement

ఏ విషయంలోనైనా నాన్చకుండా నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట అయిన బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ఇప్పుడు ఏపీ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్ధం కాని పరిస్థితి ఏర్పడుతోంది. ఏపీ రాజకీయాలు ఎంత మజాగా ఉంటాయో ఆయనకు ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుని విషయంలో కూడా సులభంగా నిర్ణయాలు తీసుకున్న అమిత్‌షా ఏపీ విషయంలో మాత్రం తలలు పట్టుకుంటున్నాడు. బిజెపి ఫైర్‌ బ్రాండ్‌ అయిన ఎమ్మెల్సీ సోమువీర్రాజుకు బిజెపి పగ్గాలు ఇస్తే బాగుంటుందని, దానివల్ల ఏపీలో అతి ముఖ్యమైన కాపులను తమ వైపుకు తిప్పుకో గలమని కొందరు భావిస్తుంటే ఆయనను విభేదించే వారు ఎక్కువయ్యారు. ముఖ్యంగా ఏపీ హీరో వెంకయ్యనాయుడుకు సోము వీర్రాజును అధ్యక్షునిగా చేయడం ఇష్టంలేదు. బిజెపి మిత్రపక్షమైన టిడిపికి కూడా సోమువీర్రాజును ఎంపిక చేయడం ఇష్టంలేదు. ఎంతైనా వెంకయ్య, చంద్రబాబులు ఓ గూటి పక్షులు. వారిద్దరికి సోమువీర్రాజను అధ్యక్షున్ని చేయడం ఇష్టంలేదు. దాంతో పాటు ఏపీ ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు ఎంపీ హరిబాబు, రాష్ట్రమంత్రి కామినేని శ్రీనివాస్‌లు కూడా సోమువీర్రాజును వ్యతిరేకిస్తున్నారు. మొత్తానికి ఏపీ బిజెపి అధ్యక్షుని సమస్య ఇప్పుడు పలు మలుపులు తిరుగుతోంది. మరి చంద్రబాబు, హరిబాబు, కామినేనిశ్రీనివాస్‌లతో పాటు ఏపీ కీలకనేత ఒకేఒక్కడు అయిన వెంకయ్య అభీష్టానికి వ్యతిరేకంగా బిజెపి జాతీయ అధిష్టానం నిర్ణయం తీసుకునే దమ్ముందా? లేదా? అన్నది త్వరలో తేలిపోతుంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement