Advertisementt

కోదండరామిరెడ్డి పై చిరు ఫ్యాన్స్ ఫైర్!

Tue 12th Jul 2016 11:46 AM
kodandarami reddy,chiranjeevi,comedy,message oriented film,chiranjeevi politics  కోదండరామిరెడ్డి పై చిరు ఫ్యాన్స్ ఫైర్!
కోదండరామిరెడ్డి పై చిరు ఫ్యాన్స్ ఫైర్!
Advertisement
Ads by CJ

సుప్రీంహీరో చిరంజీవిని మెగాస్టార్‌ చిరంజీవిగా మార్చిన వారిలో ముందుండే దర్శకుడు కోదండరామిరెడ్డి. ఆయన ఇటీవల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ..'చిరంజీవి సందేశాలు చెబితే ప్రేక్షకులు భరించలేరని' వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై చిరంజీవి అభిమానులు ఆయనపై మండిపడుతున్నారు. కోదండరామిరెడ్డి వ్యాఖ్యలను తప్పపడుతున్నారు. కానీ ఇక్కడ ఎంతో అనుభవం ఉన్న కోదండరామిరెడ్డి చేసిన కామెంట్లు వాస్తవమే అని సినీ, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి..దానిని నడపలేక కేవలం తన రాజకీయ అవసరాల నిమిత్తం పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేసినప్పుడు రాజకీయ నాయకుడిగా చిరుకు చెడ్డ పేరు వచ్చిందని, అలాంటి చిరును ఆయన అభిమానులు కూడా ఓ హీరోగా ఆదరిస్తారే గానీ, రాజకీయంగా, సందేశాలపరంగా, ఉపన్యాసాల పరంగా ఆయన చెప్పే నీతులను ఎవ్వరూ జీర్ణించుకోలేరని విశ్లేషకులు అంటున్నారు. అందుకే మొదటి నుండి చిరు సందేశాలు వద్దు..వినోదమే ముద్దు అంటూ వస్తున్నాడు. ఇక కోదండరామిరెడ్డి కూడా తనకు మరోసారి చిరును డైరెక్ట్‌ చేసే అవకాశం వస్తే.. మాత్రం సందేశాత్మక చిత్రం మాత్రం చేయనని, మంచి వినోదం పంచే చిత్రాన్ని మాత్రమే చేస్తానని చెబుతున్నాడు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ