పవన్ తో హిట్టు కొట్టలేకపోవడానికి కారణం!

Fri 08th Jul 2016 04:20 PM
pawan kalyan,sharrath marar,jyothish,vaasthu,gopala gopala,sardaar gabbar singh  పవన్ తో హిట్టు కొట్టలేకపోవడానికి కారణం!
పవన్ తో హిట్టు కొట్టలేకపోవడానికి కారణం!
Sponsored links

పవన్‌కళ్యాణ్‌ ఇటీవల చేసిన 'గోపాల గోపాల', 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'లకు ఆయన స్నేహితుడు శరత్‌మరార్‌ నిర్మాత అన్న విషయం తెలిసిందే. కానీ 'గోపాల గోపాల' చిత్రం కేవలం యావరేజ్‌గా నిలవగా, 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో తర్వాత తను చేయబోయే ఎస్‌.జె.సూర్య సినిమా నిర్మాణ బాధ్యతలు కూడా పవన్‌.. శరత్‌మరార్‌కే అప్పగించాడు. కానీ ఈ చిత్రం నుండి సూర్య అర్దాంతరంగా తప్పుకున్నాడు. డాలీని డైరెక్టర్‌గా తీసుకున్నా ఈ చిత్రంపై పలు అనుమానాలు, అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీంతో శరత్‌మరార్‌ ఓ ప్రముఖ జ్యోతిష్యుని సంప్రదించగా ప్రస్తుతం శరత్‌మరార్‌ తీసుకున్న ఆఫీస్‌ వాస్తు సరిగా లేదని.. అందువల్లే శరత్‌కు ఇన్ని కష్టాలు వస్తున్నాయని స్పష్టం చేశాడట. సో.. త్వరలోనే మరో కొత్త ఆఫీస్‌ను తీసుకునే యోచనలో శరత్‌మరార్‌ ఉన్నట్లు సమాచారం. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019