Advertisementt

నాగ్, అనుష్క లను విడదీశాడుగా..!

Wed 06th Jul 2016 04:52 PM
anushka,k.raghavendra rao,om namo venkatesaya,nagarjuna,devoty,special role  నాగ్, అనుష్క లను విడదీశాడుగా..!
నాగ్, అనుష్క లను విడదీశాడుగా..!
Advertisement
Ads by CJ

నాగార్జున - కె. రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో వచ్చిన భక్తిరస చిత్రాలు అన్ని హిట్ అయ్యాయి. ఇక అదే కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఓం నమో వేంకటేశాయ' షూటింగ్ ఈ మధ్యనే ప్రారంభమయ్యింది. ఇక ఈ షూటింగ్ లోని విశేషాలు రాఘవేంద్ర రావు గారు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తున్నారు. అలాగే ఈరోజు(జులై 05) ఆయన అనుష్కని పొగుడుతూ ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు. ఆయన అనుష్క గురించి మాట్లాడుతూ.. ఏ క్యారెక్టర్ అయినా చేయగలిగే అద్భుతమైన నటులలో అనుష్క ఒకరు. అది అరుంధతి అయినా, బాహుబలి అయినా, రుద్రమదేవి అయినా తన పాత్రలకు తగ్గట్లు ఒదిగిపోతూ నటనతో అందరిని ఆశ్చర్య పరుస్తూనే ఉంది. ఎప్పటినుంచో తనకి నా సినిమా లో తగిన క్యారెక్టర్ ఇచ్చి, తనతో పనిచేయాలని చూస్తున్నాను. ఇన్నాళ్ళకి 'ఓం నమో వేంకటేశాయ' ద్వారా జరిగింది. తన కెరీర్ లో మొదటి సారి భక్తురాలి క్యారెక్టర్ చేస్తుంది. ఆ రోల్ లో తన అద్భుత నటన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మరియు కొత్తగా కన్పిస్తుంది.' ఓం నమో వేంకటేశాయ' లో అనుష్క.. నాగార్జున కి జంటగా నటించడం లేదు. ఈ సినిమాలో కేవలం ఆమె ఒక భక్తురాలిగా మాత్రమే నటిస్తుందని చెప్పారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ