Advertisementt

లోకేష్ కి.. రేవంత్‌ రెడ్డి ఝలక్..!

Sun 03rd Jul 2016 04:57 PM
lokesh naidu,revanth reddy,mallannasagar project,charges hike,rtc,electricity  లోకేష్ కి.. రేవంత్‌ రెడ్డి ఝలక్..!
లోకేష్ కి.. రేవంత్‌ రెడ్డి ఝలక్..!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం తెలంగాణలో టిడిపి తరపున మాట్లాడే ఒకే ఒక్క వాయిస్‌ రేవంత్‌ రెడ్డిది. కానీ టిడిపిలో ప్రస్తుతం ఏ విషయంలోనైనా చంద్రబాబు కంటే లోకేష్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు. దీంతో కొంత మంది సీనియర్లు కూడా గుర్రుగా ఉన్నారు. తాజాగా రేవంత్‌ రెడ్డి మల్లన్న సాగర్‌ భూనిర్వాసితుల కోసం నిరాహార దీక్ష చేస్తున్నాడు. అదే సమయంలో తెలంగాణలో బస్సు చార్జీలు, విద్యుత్‌ చార్జీలు పెంచారు. దాంతో లోకేష్‌బాబు రేవంత్‌రెడ్డికి ఫోన్‌ చేసి మల్లన్నసాగర్‌ సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందుగా విద్యుత్‌, ఆర్టీసీ చార్జీల బాదుడుపై పోరాటం చేయాలని సలహా ఇచ్చాడని సమాచారం. కానీ రేవంత్‌ మాత్రం చినబాబు మాటలను బేఖారత్‌ చేసి మల్లన్నసాగర్‌ దీక్షకే తన ఓటు వేసి దీక్ష చేశాడు. దీంతో రేవంత్‌ అంటే ఇప్పుడు చినబాబు మండిపడుతున్నాడని సమాచారం. చివరకు ఆయన తన తండ్రి దగ్గర కూడా ఈ విషయం వివరించి రేవంత్‌రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరాడట. కానీ తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్‌రెడ్డిని పోగొట్టుకుంటే ఇక అక్కడ మన బిచాణా ఎత్తివేయాల్సిందే అని బాబు తన చినబాబును బుజ్జగించాడని తెలుస్తోంది. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ