Advertisementt

'బాబు బంగారం' కథపై క్లారిటీ ఇచ్చాడు!

Sat 02nd Jul 2016 07:02 PM
babu bangaram,venkatesh,maruthi,nayanthara,radha movie,maruthi clarity about babu bangaram story  'బాబు బంగారం' కథపై క్లారిటీ ఇచ్చాడు!
'బాబు బంగారం' కథపై క్లారిటీ ఇచ్చాడు!
Advertisement
Ads by CJ

'భలే భలే మగాడివోయ్‌' చిత్రంతో స్టార్‌ డైరెక్టర్‌గా మారిపోయిన టాలెంటెడ్‌ అండ్‌ యంగ్‌ డైరెక్టర్‌ మారుతి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో 'బాబు బంగారం' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక్క పాట మినహా ఈ చిత్రం షూటింగ్‌ మొత్తం పూర్తయింది. ఇందులో వెంకీ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఫ్యామిలీ అండ్‌ అవుట్‌ అవుట్‌ కామెడీ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో, ట్రేడ్‌ వర్గాల్లో మంచి అంచనాలే ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో ఆమధ్య వెంకటేష్‌, నయనతార జంటగా 'రాధ' అనే చిత్రం ఆగిపోయిన విషయం తెలిసిందే. అదే స్టోరీని కాస్త మార్పులు చేర్పులు చేసి 'బాబు బంగారం' చిత్రాన్ని మారుతి తీస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. దీనిని మారుతి ఖండించాడు.'రాధ' చిత్రం కథ వేరు.. 'బాబు బంగారం' కథ వేరు. 'రాధ' ఆగిపోవడంతో ఆ కథను పక్కన పెట్టేశాను. ఆ తర్వాత నాకు వచ్చిన ఓ ఆలోచనగా 'బాబు బంగారం' చిత్రం కథను తయారుచేశాను అంటూ క్లారిటీ ఇచ్చాడు మారుతి. ఈ చిత్రాన్ని ఈనెల 29న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ