Advertisement

ప్రేక్షకులు వెరైటీ కాన్సెప్ట్స్‌ కోరుకుంటున్నారా!

Fri 01st Jul 2016 05:31 PM
  ప్రేక్షకులు వెరైటీ కాన్సెప్ట్స్‌ కోరుకుంటున్నారా!
ప్రేక్షకులు వెరైటీ కాన్సెప్ట్స్‌ కోరుకుంటున్నారా!
Advertisement

రొటీన్‌ చిత్రాలను పక్కనపెట్టి మంచి వెరైటీ కాన్సెప్ట్స్‌లో రూపొందే చిత్రాలను మన ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. నాగార్జున వంటి స్టార్‌ 'ఊపిరి' చిత్రంలో కేవలం వీల్‌ చైర్‌కే పరిమితమయ్యే పాత్రలో నటించినా ఆదరించారు. ఇక 'నాన్నకు ప్రేమతో, సన్నాఫ్‌ సత్యమూర్తి' వంటి చిత్రాలలో హీరోల కంటే వారి తండ్రుల పాత్రలు ముఖ్యమైన పాత్ర పోషించాయి. వాటిని కూడా ప్రేక్షకులు ఆదరించారు. 'అ..ఆ' చిత్రంలో హీరో నితిన్‌ కంటే హీరోయిన్‌ సమంతదే కీలకపాత్ర అయినా ఆడియన్స్‌ యాక్సప్ట్‌ చేశారు. ఇక 'బ్రహ్మోత్సవం' చిత్రం ఫ్లాప్‌ అయినప్పటికీ ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌లో మహేష్‌బాబు చెప్పులు తొడిగే పోస్టర్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. ఇక తాజాగా అనిల్‌రావిపూడి దర్శకత్వంలో రామ్‌ హీరోగా నటించే చిత్రంలో రామ్‌ అంధుడిగా కనిపించనున్నాడు. మరి రాబోయే కాలంలో నేల విడిచి సాము చేయకుండా ఇలాంటి ప్రయోగాలు మన హీరోలు చేస్తే ఆదరించడానికి ప్రేక్షకులు సిద్దంగానే ఉన్నారు. ఈ మార్పు ప్రేక్షకులకు విభిన్న చిత్రాలను అందించే దిశగా సాగుతుందని ఆశిద్దాం. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement