Advertisementt

ఎన్టీఆర్ కి ఈ భామ తెగ నచ్చేసిందట!

Tue 28th Jun 2016 01:47 PM
jr ntr,nivetha thomas,gentleman movie,vakkantham vamsi,young tiger  ఎన్టీఆర్ కి ఈ భామ తెగ నచ్చేసిందట!
ఎన్టీఆర్ కి ఈ భామ తెగ నచ్చేసిందట!
Advertisement
Ads by CJ

జెంటిల్మన్ సినిమాలో నాని పక్కన రెండో హీరోయిన్ గా చేసిన నివేత థామస్ కేరళ అమ్మాయి. జెంటిల్మన్ సినిమాతో మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. అయితే ఈ సినిమాలో నటన పరంగా మొదటి హీరోయిన్ సురభి కంటే నివేతకే మంచి మార్కులు పడ్డాయి. విమర్శకుల సైతం ఆమె నటనను మెచ్చుకున్నారు. జెంటిల్మన్ లో నివేత నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.  ఆమె నటనకు ఎన్టీఆర్  కూడా ఫిదా అయిపోయి తన తదుపరి చిత్రం లో ఛాన్స్ ఇచ్చాడనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఎన్టీఆర్ - వక్కంతం వంశీ కాంబినేషన్ లో వచ్చే సినిమాలో నివేత.. ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా నటించనుందని సమాచారం. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్... ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై నిర్మిస్తున్నాడు. ఎన్టీఆర్ ఇప్పుడు జనతా గ్యారేజ్ షూటింగ్ లో బిజీ గా వున్నాడు. జనతా గ్యారేజ్ రిలీజ్ అయిన తర్వాత వంశీ డైరెక్షన్ లో సినిమా పట్టాలెక్కనుంది అని సమాచారం. ఎన్టీఆర్ జోడిగా నివేత చేస్తుంది అని అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదే కనుక నిజమైతే నివేత దశ తిరిగినట్లే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ