రెజీనా కి అవకాశాలు రాకుండా చేస్తున్నారా!

Mon 27th Jun 2016 08:01 PM
regina,no big movies,regina cassandra,no big movies to regina cassandra  రెజీనా కి అవకాశాలు రాకుండా చేస్తున్నారా!
రెజీనా కి అవకాశాలు రాకుండా చేస్తున్నారా!
Sponsored links

రెజీనా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆమె స్టార్‌ హీరోయిన్‌ కావడం ఖాయమని చాలామంది భావించారు. అలాగే ఆమె అందం, అభినయం, అందాల ఆరబోత, చివరకు లిప్‌కిస్‌లకు కూడా ఓకే చెబుతూ రావడంతో ఆమెకు ఇక్కడ స్టార్‌ హీరోల నుంచి మంచి ఆఫర్లే వస్తాయని భావించారు. కానీ ఆమెకు సెకండ్‌గ్రేడ్‌ హీరోలనే గానీ స్టార్‌హీరోలను మెప్పించలేకపోయింది. కేవలం రవితేజ చిత్రంలో అది కూడా సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది. ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్న 'శౌర్య, సౌఖ్యం' చిత్రాలు ఫ్లాప్‌ అయ్యాయి. సాయిధరమ్‌తేజ్‌తో కలిసి ఆమె నటించిన 'పిల్లా..నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యంఫర్‌ సేల్‌' చిత్రాల్లో ఆమె నటించి మెప్పించినా కూడా ఆమెకు ఆ చిత్రాల విజయాలు ఉపయోగపడలేదు. కాగా ఇప్పుడు ఈ భామ నారారోహిత్‌ హీరోగా సాయికొర్రపాటి నిర్మాతగా, అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందే 'జ్యో అచ్యుతానంద' చిత్రంతో పాటు తమిళంలో సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో ఓ హర్రర్‌ చిత్రంలో దెయ్యంగా నటిస్తోంది. మరి రకుల్‌లాగా రెజీనా కి అవకాశాలు రాకుండా ఎవరైనా చేస్తున్నారా? లేక రెజీనా నే పెళ్లి చేసుకోవాలని అవకాశాలు వదిలేసుకుంటుందా? ప్రస్తుతం చేస్తున్న రెండు చిత్రాలతో రెజీనా కెరీర్‌ మళ్ళీ ఏమైనా మలుపుతిరుగుందా? లేదా? అనేది వేచిచూడాలి...! 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019