దిల్ రాజు సినిమా లెక్కలు ఎలా ఉంటాయో మనకు తెలియనిది కాదు. కథ మొదలుకొని సినిమాకు కావాల్సిన ఆర్టిస్టుల వరకు ఈయన గారి ఎంపిక చాలా జాగ్రత్తగా ఉంటుంది. శతమానం భవతి అన్న అద్భుతమైన టైటిల్ మీద సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఓ చిత్రం తీయాలన్న ఆలోచనను దిల్ రాజు నెమ్మదిగా ముందుకు కదుపుతున్నాడు. ప్రస్తుతానికి ఈ చిత్రానికి హీరోగా శర్వానంద్ ఎంపికయ్యారు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే మలయాళం భామ అనుపమ పరమేశ్వరన్ పట్ల రాజుగారు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. త్రివిక్రమ్ తీసిన అఆలో చిన్న పాత్రలో మెరిసిన ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ఇదే పెద్ద ఆఫర్ కానుంది. సహజంగా మంచి నటనతో పాటుగా బొద్దుగా, అందంగా కనపడే అనుపమ నిజంగానే శర్వా పక్కన సరైన జోడిగా కనపడేట్టుంది. మొన్న మరో మలయాళ కుట్టి సాయి పల్లవిని వరుణ్ తేజ్ సరసన శేఖర్ కమ్ముల చిత్రానికి గాను బ్లాక్ చేసిన దిల్ రాజు ఇప్పుడు మరో మల్లు బ్యూటీకి లైఫ్ ఇవ్వనున్నాడు. షూటింగ్ ఇంకా మొదలవని శతమానం భవతిని రానున్న సంక్రాంతి బరిలో దింపాలన్నది నిర్మాతగారి ఆలోచన.





Loading..