టిడిపి కి మళ్ళీ కాపు మంట పెడుతున్నాడు!

Fri 24th Jun 2016 09:40 PM
kapu,akula satyanarayana,bjp,tdp,mudragada padmanabam  టిడిపి కి మళ్ళీ కాపు మంట పెడుతున్నాడు!
టిడిపి కి మళ్ళీ కాపు మంట పెడుతున్నాడు!
Sponsored links

కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించాడు. దాంతో ప్రస్తుతానికి ఆ విషయాన్ని కాస్త పక్కనపెట్టి మంజునాథన్‌ కమిషన్‌ ఇచ్చే రిపోర్ట్‌ కోసం ఆగష్టు వరకు వేచిచూస్తే మంచిది. కానీ కొందరు ఇంకా ఇంకా కాపులను రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేస్తూనే ఉన్నారు. పోనీ ప్రతిపక్షాలైన వైసీపీ, కాంగ్రెస్‌లు ఇలా రెచ్చగొట్టారంటే ఆశ్యర్యం లేదు. కానీ ఆ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నది స్వయాన టిడిపి మిత్రపక్షమైన బిజెపి ఎమ్మేల్యే కావడం దురదృష్టకరం. బిజెపి ఎమ్మెల్యేగా ఉండి ముద్రగడ దీక్షకు మద్దతు పలికిన బిజెపి ఎమ్మేల్యే ఆకుల సత్యనారాయణనే ఈ పని చేయడం దురదృష్టకరం. ముద్రగడ విషయంలో మొదటి నుండి టిడిపి వ్యతిరేకతతో వ్యవహరించిందని, అది కాపులను అణిచివేయడానికి టిడిపి పన్నిన వ్యూహంగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించాడు. అలా అణిచివేస్తే ఎలాంటి పరిణామాలు ఏర్పడుతాయో దేశంలో ఎమర్జెన్సీ తర్వాతి రోజులను గుర్తుంచుకోవాలని ఆయన సీఎం చంద్రబాబుకు ఓ చిన్నపాటి వార్నింగ్‌లాంటిది ఇచ్చాడు. ఇక పోలీసులు కూడా ముద్రగడను ఆయన కుటుంబాన్ని హింసించారని, వారిపై కటువుగా వ్యవహరించారని, దాని వల్ల కాపులు రెచ్చిపోయే పరిస్థితి ఉందని ఆయన అభిప్రాయం. కుల పిచ్చి ఉండవచ్చు గానీ మరీ ఈ స్దాయిలో ఆ పిచ్చి నరనరాలకు చేరడం, విద్వేషాలు రెచ్చగొట్టడం ఓ బాధ్యతాయుతమైన ఆ ఎమ్మేల్యేకు తగదని బిజెపి వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019