Advertisement

లోకేష్ ఏపీ లో పులే..మరి తెలంగాణ లో!

Thu 23rd Jun 2016 11:25 PM
lokesh naidu,chandrababu,andhra pradesh,telangana,lokesh politics  లోకేష్ ఏపీ లో పులే..మరి తెలంగాణ లో!
లోకేష్ ఏపీ లో పులే..మరి తెలంగాణ లో!
Advertisement

ప్రస్తుతం ఏపీ టిడిపి నిర్ణయాలన్నీ చినబాబు కనుసైగలలోనే జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో చిన్నపాటి నాయకులు, జిల్లా స్దాయి నాయకులు, చివరికి సీనియర్‌ టిడిపి నాయకులు కూడా ఏదైనా సమస్య వస్తే చంద్రబాబుకు ముందు లోకేష్‌బాబు దగ్గరకే తమ సమస్యలను తీసుకెళ్తున్నారు. దీంతో చంద్రబాబుకు, లోకేష్‌కు తప్ప మరెవ్వరికీ పనిలేకుండా పోతోంది. మంత్రుల నిర్ణయాలను కూడా ముందు లోకేష్‌ దగ్గరకే తీసుకెళ్తున్నారు. యువరాజు జోక్యం ఈస్దాయిలో ఉండేసరికి ఏపీ టిడిపి అధ్యక్షడు కళావెంకట్రావ్‌తో పాటు సీనియర్‌ నాయకులకు కూడా పనిలేకుండా పోతోంది. ఏదైనా విషయాన్ని కింది స్దాయి నాయకులు మంత్రుల వద్దకు, కళా దగ్గరకు తీసుకెళ్లినా కూడా చివరకు వారు కూడా లోకేష్‌నే సంప్రదించాల్సిన పరిస్దితుల్లో ఉండటంతో ఇక వీరికి చెప్పి ఏమిలాభం? అదేదో మనమే లోకేష్‌ దృష్టికి తీసుకొని వెళితే హాయి కదా? అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఏపీ లో చినబాబుని టిడిపి నాయకులు, కార్యకర్తలు పులిలా చూసుకుంటున్నారు.  అయినా కూడా లోకేష్‌ను కాదని, చంద్రబాబుకు ఈ విషయంలో ఫిర్యాదు చేసే సాహసం ఎవ్వరు చేయడంలేదు. మొత్తానికి ఏపీలోని కీలకనిర్ణయాలన్నీ చినబాబు దగ్గరకే వెళ్తున్నాయి. ఈ విషయంలో లోకేష్‌ పాత్రను మెచ్చుకుంటున్న వారు కూడా ఉంటున్నారు. రాబోయే రోజుల్లో లోకేష్‌ టిడిపికి అన్ని తానే అవుతాడు కాబట్టి ఇప్పటినుండే ఆయన సమస్యలను విని వాటిని పరిష్కరించడం నేర్చుకుంటే పగ్గాలు చేతికి వచ్చేనాటికి ఆయన రాజకీయంగా రాటుదేలుతారని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం, సంస్దాగత నిర్ణయాలు, ఇన్‌చార్జ్‌లను నియమించడం, మరలా కార్యకర్తల్లో ఉత్సాహం పెంపొందించడం వంటి బాధ్యతలను లోకేష్‌కే అప్పగించాడు. మరి లోకేష్‌ తెలంగాణ విషయంలో ఏ వ్యూహంతో ముందుకు వెళ్తాడు? అనే ఆసక్తి నెలకొని ఉంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement