Advertisementt

ఈసారి సంక్రాంతికి కూడా తప్పదు పోటీ!

Thu 23rd Jun 2016 12:05 PM
sankranthi race,top heroes movies,chiranjeevi,balakrishna,nagarjuna,pawan kalyan  ఈసారి సంక్రాంతికి కూడా తప్పదు పోటీ!
ఈసారి సంక్రాంతికి కూడా తప్పదు పోటీ!
Advertisement
Ads by CJ

ఈ ఏడాది సంక్రాంతికి ఎన్టీఆర్‌ 'నాన్నకు ప్రేమతో', బాలకృష్ణ 'డిక్టేటర్‌', నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయనా', శర్వానంద్‌ 'ఎక్స్‌ప్రెస్‌రాజా'లు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నాలుగు చిత్రాలు మూడు నాలుగురోజుల వ్యవధిలో విడుదల కావడంతో వీటిమధ్యపోటీ వల్ల ఏ చిత్రానికి సరైన కలెక్షన్లు రావని ట్రేడ్‌ వర్గాలు ఊహించాయి. కానీ దానికి భిన్నంగా ఈ నాలుగు చిత్రాలు మంచి కలెక్షన్లు సాధించాయి. వీటిలో నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయనా' బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ఎక్కువ లాభాలు సంపాదించింది. ఆ స్ఫూర్తితోనే వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా నాలుగు చిత్రాలు పోటీపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలయ్య నటిస్తున్న100వ చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సంక్రాంతికి రానుంది. మరోవైపు మెగాస్టార్‌ 150వ చిత్రం 'కత్తి' రీమేక్‌ కూడా సంక్రాంతికే విడుదలకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభం కాకపోయినా రీమేక్‌ చిత్రం కాబట్టి కంటిన్యూగా షూటింగ్‌ చేసి సంక్రాంతికి రావడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక నాగార్జున-కె.రాఘవేంద్రరావుల కాంబినేషన్‌లో రూపొందనున్న 'ఓం నమో వేంకటేశాయ', పవన్‌కళ్యాణ్‌ హీరోగా డాలీ దర్శకత్వంలో రూపొందే చిత్రం కూడా సంక్రాంతికే ప్లాన్‌ చేస్తున్నారు. మరి ఈసారి పోటీలో ఎవరు విజేతగా నిలుస్తారో వేచిచూడాల్సివుంది! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ