Advertisementt

కోడెలకు ఇబ్బందులు తప్పేలా లేవు!

Wed 22nd Jun 2016 12:25 PM
kodela siva prasad,ap speaker,elections,old 30 thousand,new 11.5 crores,media   కోడెలకు ఇబ్బందులు తప్పేలా లేవు!
కోడెలకు ఇబ్బందులు తప్పేలా లేవు!
Advertisement
Ads by CJ

తాను ఒకప్పుడు 30వేల రూపాయల ఖర్చుతో ఎన్నికల్లో గెలిచానని, కానీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం 11.5కోట్లు ఖర్చుపెట్టాల్సి వచ్చిందని ఏపీ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ ఓ టీవీ చానెల్‌ ఇంటర్వ్యూలో వాపోయారు. రోజురోజుకి రాజకీయాల్లో డబ్బు విలువ పెరిగిపోతోందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా బాధ పడిన కోడెల మాటలు అక్షరాలా సత్యం. ఆయన మాట్లాడింది పచ్చి వాస్తవం. ఆయన ఆవేదన ఆర్దం చేసుకోవాల్సిన విషయమే. కానీ ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం 25లక్షల కంటే ఎక్కువ ఖర్చుపెట్టడానికి వీలులేదు. దీంతో ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకోవాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఈ విషయంపై ఎన్నికల సంఘాన్ని కలవనున్నారట. మరో మెట్టు పైకెక్కి ఈ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటాగా తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇది వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనంగా చెప్పవచ్చు. వైసీపీ ఎమ్మెల్యేలు, జగన్‌.. ఇలా అందరూ ఎన్నికల్లో కేవలం 25లక్షల ఖర్చుతోనే గెలిచారా? అనే ప్రశ్న రాకమానదు. మరోవైపు కోడెల ఇంటర్వ్యూలో కాస్త తొందరపడ్డాడనే చెప్పవచ్చు. కానీ ఆయన కూడా తాను ఆ మాటలు అనలేదని మీడియానే ఈ విషయాన్ని వక్రీకరించదని చెబుతున్నాడు. చేసిందంతా చేసి చివరకు మీడియా మీదకు తప్పును నెట్టడం సరికాదు. కావాలంటే ఆ వీడియా ఫుటేజ్ ని  ఒక్కసారి పరిశీలిస్తే ఎవరికైనా కోడెల చెప్పింది నిజమా? కాదా? అని తేలుతుంది. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ