Advertisement

బాబుపై పైచేయి సాధించారా...?

Tue 21st Jun 2016 01:11 PM
chandrababu naidu mudragada kapu netha arrest deeksha upper hand  బాబుపై పైచేయి సాధించారా...?
బాబుపై పైచేయి సాధించారా...?
Advertisement

కాపుల విషయంలో ముద్రగడ పద్మనాభం చంద్రబాబుపై పైచేయి సాధించారా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తుని ఘటన కేసులో అందరినీ విడుదల చేయాలని, వారు అమాయకులని ముద్రడగ 13రోజులుగా దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో అరెస్టైన అందరికీ న్యాయస్దానం బెయిల్‌ మంజూరు చేసింది. ఐదు రోజుల కిందట 10మందికి, తాజాగా మరో ముగ్గురికి బెయిల్‌ లభిచండంతో ముద్రగడ పంతం నెగ్గినట్లు అయింది. ఇక ముద్రగడ దీక్షను విరమించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ విషయంలో నిందితులను ఆరెస్ట్‌ చేసినప్పుడు తాము తగిన ఆధారాలతోనే అరెస్ట్‌లు చేశామని, తమ వద్ద వీడియో పుటేజ్‌లు కూడా ఉన్నాయని..  ప్రభుత్వం చెబూతూ వచ్చింది. ముద్రగడ విషయంలో కాస్త కఠినంగానే వ్యవహరించింది. కానీ చివరకు మాత్రం ముద్రగడ వ్యూహమే గెలిచింది. అయితే నిందితులను విడిచిపెట్టాలని దీక్షకు దిగిన ముద్రగడకు ఇది కేవలం తాత్కాలిక విజయమే అని, అలాంటి వ్యక్తులకు ఎవ్వరూ మద్దతు ఇవ్వకూడదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిందితులను నేరస్తులు అవునో కాదో నిర్ణయించాల్సింది న్యాయస్దానాలే కానీ కుల సంఘాల నేతలు కాదని, అది అవాంఛనీయమని కొందరు విశ్లేషిస్తున్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement