Advertisementt

బావతో సినిమా చేస్తానంటుంది!

Mon 20th Jun 2016 09:33 PM
sowndarya,dhanush,rajinikanth,kocchadayan movie  బావతో సినిమా చేస్తానంటుంది!
బావతో సినిమా చేస్తానంటుంది!
Advertisement
Ads by CJ

రజినీకాంత్ ఇద్దరు కూతుళ్ళు, తన పెద్ద అల్లుడు ధనుష్ మంచి టాలెంటెడ్ పెర్సన్స్. ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య '3' సినిమాతో దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఆ తరువాత చేసిన 'వై రాజా వై' అనే సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంది. అలానే రజినీకాంత్ చిన్న కూతురు సౌందర్య తన తండ్రిని హీరోగా పెట్టి భారీ బడ్జెట్ తో 'కొచ్చడయాన్' అనే యానిమేషన్ సినిమా చేసింది. ఈ సినిమా నిర్మాతలకు భారీ నష్టాల్నే మిగిల్చింది. అయినా తను నిరాశ పడకుండా రెండో సినిమాను తన బావ ధనుష్ ను హీరోగా పెట్టి చేయడానికి సిద్ధమవుతుందట. ఈ విషయాన్ని స్వయంగా సౌందర్యనే వెల్లడించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. ఇది యానిమేషన్ సినిమా కాదని, లవ్ అండ్ కామెడీ జోనర్ లో ఉండే సినిమా అని స్పష్టం చేశారు. ధనుష్ ని కలిసి కథా చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. మరి రెండో సినిమా అయినా.. సౌందర్యకు సక్సెస్ ను ఇస్తుందేమో చూడాలి..!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ