Advertisementt

రజనీ పై అనుమానాలు పెంచుతున్నారు!

Fri 17th Jun 2016 07:32 PM
rajinikanth,rajinikanth health condition,super star,kabali,robot 2  రజనీ పై అనుమానాలు పెంచుతున్నారు!
రజనీ పై అనుమానాలు పెంచుతున్నారు!
Advertisement
Ads by CJ

'రోబో2.0' చిత్రం మేకప్‌ విషయంలో రజనీ అమెరికాలో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ ఒక్కరోజు గ్యాప్‌ తీసుకొని 'కబాలి' ఆడియోకు ఎందుకు ఆయన హాజరుకాలేకపోయాడనే సందేహాలను మీడియాతోపాటు కోలీవుడ్‌ ఇండస్ట్రీ, రజనీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం రజిని అనారోగ్య కారణాల వల్లనే అమెరికాలో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నాడనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. అందరూ అదే నిజం అని కూడా భావిస్తున్నారు. దీనివల్ల ఆల్‌రెడీ షూటింగ్‌ పూర్తి చేసుకున్న'కబాలి'కి వచ్చే ఎఫెక్ట్‌ ఏమీ లేనప్పటికీ 200కోట్ల పైగా బడ్జెట్‌తో శంకర్‌ దర్శకత్వంలో 'రోబో2.0' నిర్మిస్తున్న నిర్మాతలు మాత్రం ఈ విషయంలో కంగారు పడుతున్నారు. ఆరోగ్యం బాగా లేకపోతే తమ హీరో ఆ సినిమాలో ఎలా నటించాడో అని అభిమానులు ఆందోళన పడుతుంటే, నిర్మాతలు కూడా ఆరోగ్యం బాగా లేని హీరో సినిమాకు ఫైనాన్స్‌ చేసేవారు రిస్క్‌ తీసుకోరని కంగారుపడుతున్నారు. నిర్మాత రాజు రామలింగం మాట్లాడుతూ.. రజనీ చాలా ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన తన కుటుంబంతో అమెరికాలో హాలీడేట్రిప్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడని స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఒకపక్క 'రోబో2.0'కి చెందిన మేకప్‌ టెస్ట్‌ కోసం ఆయన అమెరికాలో చికిత్స పొందుతున్నాడని వార్తలు వస్తుంటే నిర్మాతలు మాత్రం ఫ్యామిలీ ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడని చెప్పడం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ