Advertisementt

నాగ్‌ కూడా సంక్రాంతికే ప్లాన్‌ చేస్తున్నాడు...!

Fri 17th Jun 2016 06:28 PM
nagarjuna,hathiram baba,sankranthi,anushka,raghavendra rao,om namo venkatesaya  నాగ్‌ కూడా సంక్రాంతికే ప్లాన్‌ చేస్తున్నాడు...!
నాగ్‌ కూడా సంక్రాంతికే ప్లాన్‌ చేస్తున్నాడు...!
Advertisement
Ads by CJ

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రంతో ఘన విజయం సొంతం చేసుకున్న నాగ్‌ తన తదుపరి చిత్రాన్ని కూడా వచ్చే ఏడాది సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు తేనున్నాడని సమాచారం. ఇప్పటికే ప్రీపొడక్షన్‌తో పాటు అన్ని కార్యక్రమాలు, ముఖ్యంగా లొకేషన్ల ఎంపిక పూర్తి అయింది. దాంతో వీలున్నంత త్వరగా ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని నాగ్‌, రాఘవేంద్రరావులు భావిస్తున్నారు. 'ఓం నమో వేంకటేశాయ' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తిరుమల వేంకటేశ్వరుని ప్రియ భక్తుడైన హతీరాం బాబా జీవతచరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో స్వీటీ అనుష్క ఓ సన్యాసిని క్యారెక్టర్‌ను చేయనుందని సమాచారం. అలాగే ప్రగ్యాజైస్వాల్‌ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీవేంకట్వేరస్వామి భార్య శ్రీదేవిగా విమలారామ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈచిత్రం వచ్చే నెల నుండి అంటే జులై నుండి సెట్స్‌పైకి వెళ్లనుంది. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ