Advertisement

కేసీఆర్ ఉప ఎన్నికల వ్యూహం !!

Thu 16th Jun 2016 08:53 PM
kcr,telangana,by pols,3 years,only trs,tdp,congress  కేసీఆర్ ఉప ఎన్నికల వ్యూహం !!
కేసీఆర్ ఉప ఎన్నికల వ్యూహం !!
Advertisement

కేసీఆర్ గంపాగుత్తగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. భవిష్యత్తులో తెలంగాణలో తెదేపా, కాంగ్రెస్ ఉండకూడదని ఆయన ఎత్తుగడ. 2019 ఎన్నికల్లో తెరాస మాత్రమే ఉండాలి. ఇందుకోసం విలువలకు తిలోదకాలు ఇచ్చేశారు. తెరాసకు వ్యతిరేకంగా పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలను, ఎంపీలను చేర్చుకుంటున్నారంటే, ఆయా నియోజకవర్గ ప్రజల తీర్పును అగౌరపరిచినట్టే. ప్రజామోదం లేకుండా నాయకులు చేరుతున్నారు. ఇప్పటికే చేరిన తెదేపా నేతలు గోళ్ళు గిల్లుకు కూర్చుంటున్నారు. ఇంతవరకు వారికి ఎలాంటి పదవులు దక్కలేదు. పార్టీ పరంగా కూడా పదవులు ఇవ్వలేదు. కేవలం ఉత్సవ విగ్రహాల్లా మిగిలారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు చేరి సాధించేది ఏమిటీ, కేసీఆర్ కు జై కొట్టడం మినహా మరేమి ఉండదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

ఇదిలాఉంటే కేసీఆర్ కొత్త వ్యూహాన్ని రచిస్తున్నట్టు సమాచారం. అదేమంటే చేరిన వారిలో కొందరి చేత రాజీనామా చేయిస్తారు. అప్పుడు ఉప ఎన్నిక వస్తుంది. పోటీ చేస్తే తెరాస గెలిస్తే ప్రజామోదం మాకే ఉందని ఢంకాబజాయించి చెప్పవచ్చు. ఫిరాయింపులపై వస్తున్న ఆరోపణలకు ఇది సమాధానంగా ఉంటుందట. ఎం.పి. గుత్తా చేత రాజీనామా చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఉప ఎన్నికలకు వెళ్ళడం అంటే తెరాసకు మహా సరదా, ఉద్యమ కాలంలో కూడా ఇదే రకమైన వ్యూహాన్ని కేసీఆర్ రచించారు. ఇప్పుడు కూడా అదే తరహాలో వెళ్ళే ఆలోచన ఉందని సన్నిహితులు అంటున్నారు. అంటే ప్రతి ఆరు నెలలకు ఒక ఉప ఎన్నిక వచ్చేలా ప్లాన్ చేసుకుంటూ, 2019 ఎన్నికలకు వెళతారన్నమాట. అందుకే తొలిసారి ఆయన నోట వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తాం అనే మాట వచ్చింది. అయితే ఉప ఎన్నికల్లో కేవలం అధికార పార్టీ గెలవడం అనేది కేవలం మొదటి మూడేళ్ళ వరకే, ఆ తర్వాత ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి కాబట్టి విపక్షాల వైపు మొగ్గు చూపుతారని చరిత్ర చెబుతోంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement