Advertisement

కేసీఆర్‌ కి.. తత్వం బోధపడింది!

Wed 15th Jun 2016 08:54 PM
kcr,kodandaram,jac,telangana,kodandaram controversy,full stop  కేసీఆర్‌ కి.. తత్వం బోధపడింది!
కేసీఆర్‌ కి.. తత్వం బోధపడింది!
Advertisement

తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం ఇటీవల కేసీఆర్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో టిఆర్‌ఎస్‌ మంత్రుల నుండి చోటా నాయకుల వరకు అందరూ కోదండరాంపై విమర్శలు గుప్పించారు. కానీ గత మూడు నాలుగు రోజులుగా ఈ జోరు తగ్గింది. దీనికి కేసీఆర్‌ ఆదేశమే కారణం అంటున్నారు. కోదండరాంను విమర్శించవద్దని కేసీఆర్‌.. పై క్యాడర్‌ నుండి కింది క్యాడర్‌ వరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారట. కోదండరాంను విమర్శిస్తే వాటిని విపక్షాలు క్యాష్‌ చేసుకునే పరిస్థితి ఉందని గ్రహించిన కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. కోదండరాం విషయంలో ఈ నిర్ణయం కేసీఆర్‌ చాలా ఆలస్యంగా తీసుకున్నాడని స్పష్టమవుతోంది. ఇప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. కోదండరాం టిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేసిన వెంటనే హరీష్‌రావు నుండి కింది స్దాయి నాయకుల వరకు ఆయనపై దుమ్మెత్తిపోసి ఆయనపై పలు ఆరోపణలు చేశారు. ఇవి బాగానే బెడిసికొట్టాయి. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కోదండరాం మాత్రం వెనక్కు తగ్గలేదు. తాను పది మందికి చెప్పేవాడినే కానీ ఎవరి నుండో చెప్పించుకునే వాడిని కాదని ఘాటుగా విమర్శలు చేశారు. దాంతో వెనక్కి తగ్గడం కేసీఆర్‌ వంతైంది. కేవలం రెండు మూడు రోజులు కోదండరాం చేసిన విమర్శలకే ఎప్పుడూ లేనిది కేసీఆర్‌కు చెమటలు పట్టాయి. దీన్ని విపక్షాలు కూడా సరిగ్గానే క్యాష్‌ చేసుకున్నాయి. ఇంకా కోదండరాంపై విమర్శలు చేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని, ఇప్పటివరకు రాష్ట్ర ప్రజల్లో పెద్ద వ్యతిరేకత లేదని, కోదండరాంపై విమర్శలు చేస్తే వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని కేసీఆర్‌ గ్రహించాడు. గత రెండేళ్లలో కేసీఆర్‌కు విపక్షమే లేకుండా పోయింది. కానీ ఒక్కసారిగా కోదండరాం బయటకు వచ్చేసరికి టిఆర్‌ఎస్‌లో వణుకు పుట్టింది. దీంతో కోదండరాంను విమర్శిస్తే అది తేనెతుట్టేను కదిపినట్టే అవుతుందని కేసీఆర్‌ భావిస్తున్నారు. అంతేకాదు... ఇతర జేఏసీ నాయకులు కూడా కోదండరాంకు మద్దతు ఇస్తుండటం ఇక్కడ గమనార్హం. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement