Advertisement

ఇంకెక్కడికి..సినిమా ఇండస్ట్రీ వెళ్ళేది..?

Mon 13th Jun 2016 07:54 PM
chiranjeevi,kcr,konidala studios,telangana,hyderabad,vizag,andhra pradesh  ఇంకెక్కడికి..సినిమా ఇండస్ట్రీ వెళ్ళేది..?
ఇంకెక్కడికి..సినిమా ఇండస్ట్రీ వెళ్ళేది..?
Advertisement

రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత సినీ పరిశ్రమ ఆంధ్రాకు వెళుతుందనే ప్రచారం జరిగింది. ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు.. చిరంజీవి, అల్లుఅరవింద్‌లకు వైజాగ్‌లో స్టూడియోలు కట్టడానికి స్థలం ఇప్పిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే సినీ పరిశ్రమ హైదరాబాద్‌ నుండి వెళ్లిపోకుండా తెలంగాణ సీఎం కేసీఆర్‌ తనదైన వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ ఉన్న స్టూడియోలకు కావాల్సిన సహాయసహకారాలను తక్షణమే అందిస్తుండటంతో పాటు సినీ ప్రముఖులతో వ్యక్తిగతంగా కూడా మంచి సంబంధాలు సాగిస్తున్నారు. అయితే చిరంజీవి వైజాగ్‌లో స్టూడియో కట్టి వెళ్లిపోతే మెజార్టీ సినీ జనం కూడా హైదరాబాద్‌ నుండి తరలి వెళ్తారన్న విషయాన్ని పసిగట్టిన కేసీఆర్‌ 'గౌతమీ పుత్రశాతకర్ణి' ప్రారంభోత్సవ సమయంలో ఈ విషయమై చిరుతో మాటలు కలిపినట్లు తెలుస్తోంది. అప్పుడు చిరంజీవి మీ సహాయం ఉంటే హైదరాబాద్‌లోనే స్టూడియో కట్టాలని ఉందని కేసీఆర్‌కు తెలిపాడని సమాచారం. దానికి సుముఖత వ్యక్తం చేసిన కేసీఆర్‌ ఆఘమేఘాల మీద హైదరాబాద్‌ శివారు ప్రాంతాలలోని భూమిని చిరుకు నామమాత్రపు ధరకు స్టూడియో కట్టేందుకు కేటాయించే పనుల్లో ఉన్నాడట. కొణిదెల స్టూడియోస్‌ పేరిటి చిరు స్టూడియో కట్టనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో కట్టే తొలి స్టూడియోగా ఇది చరిత్రలో నిలిచిపోతుందని అంటున్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement