Advertisementt

బరువు తగ్గుతోన్న సీనియర్ హీరో!

Sun 12th Jun 2016 09:20 PM
  బరువు తగ్గుతోన్న సీనియర్ హీరో!
బరువు తగ్గుతోన్న సీనియర్ హీరో!
Advertisement
Ads by CJ

త్వరలో నాగార్జున హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మహేష్‌రెడ్డి నిర్మాతగా 'ఓం నమో వేంకటేశాయ' చిత్రం పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. శ్రీ వేంకటేశ్వరస్వామికి వీరభక్తుడైన హతీరాం బాబా జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. 'ఊపిరి' చిత్రం కోసం కాస్త బరువు పెరిగిన నాగార్జున హతీరాం బాబా పాత్ర కోసం బరువు తగ్గే పనిలో ఉన్నాడు. అయితే ఈ చిత్రంలో అనుష్క, ప్రగ్యా జైస్వాల్‌లు కీలకపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. కె.రాఘవేంద్రరావు - నాగార్జునల కాంబినేషన్‌లో వచ్చిన 'అన్నమయ్య, శ్రీరామదాసు' చిత్రాలలో వేంకటేశ్వరస్వామిగా, రాముడిగా అలరించిన సుమన్‌ ఈ చిత్రంలో కూడా వేంకటేశ్వరస్వామి పాత్రను పోషిస్తారని అందరూ భావించారు. కానీ దర్శకనిర్మాతలు ఈ చిత్రం కోసం కొత్త వేంకటేశ్వరస్వామిని సెలక్ట్‌ చేసుకున్నట్లు సమాచారం. హిందీ సీరియల్స్‌లో శ్రీకృష్ణుడిగా నటించి మంచి పేరు తెచ్చుకున్న సురభ్‌రాజ్‌జైన్‌ ఈ చిత్రంలో వేంకటేశ్వరస్వామి పాత్రలో నటిస్తున్నాడు. 'గాయం2, రంగా ది దొంగ' చిత్రాల్లో నటించిన విమలారామన్‌ ఈ చిత్రంలో వేంకటేశ్వరస్వామి భార్యల్లో ఒకరైన శ్రీదేవి పాత్రలో నటించనుందని సమాచారం. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ