Advertisement

బాబోయ్... సురేందర్ రెడ్డా లేక సుకుమారా?

Sun 12th Jun 2016 02:56 PM
surender reddy,dhruva  బాబోయ్... సురేందర్ రెడ్డా లేక సుకుమారా?
బాబోయ్... సురేందర్ రెడ్డా లేక సుకుమారా?
Advertisement

దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాల్లో యాక్షన్, కామెడీ, స్టైల్, మంచి కథనం ఉంటుందని తెలుసు గానీ, మరీ ఎక్కువగా మైండ్ గేమ్ లాంటి తెలివైన ఆటలు ఉండడం తక్కువే. ప్రస్తుతానికి రామ్ చరణ్ హీరోగా ధ్రువ అన్న సినిమాని తమిళం తని ఒరువన్ నుండి తెలుగులో రీమేక్ చేస్తున్న సురేందర్ రెడ్డి సరదాకి వదలాడో లేక కావాల్సుకొని వదిలాడో తెలీదు గానీ ధ్రువకు సంబంధించిన ఓ క్రియేటివ్ స్టిల్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఎలక్ట్రానిక్ సర్క్యూట్ బొమ్మలు, హయ్యర్ లెవెల్ మ్యాథ్స్ ఫార్ములాలు, ఇంటిగ్రేషణ్లు, హోల్ స్క్వేర్లు, సిగ్మాలు, స్క్వేర్ రూట్లు... నానా గడ్డంతా ఈ పోస్టర్లో వేసి జనాన్ని కంగారు పెట్టించేసాడు. తని ఒరువన్ చిత్రంలో మైండ్ గేమ్ ఉంది కానీ ఈ లెవెల్లో మాత్రం లేదు. హీరో బాడీలో GPS సర్క్యూట్ పెట్టే వరకే ఆ ప్లే ఉంటుంది. ఆ తరువాత... అబ్బే, ఇక్కడే చెప్పేస్తే బాగోదులెండి... సురేందర్ రెడ్డి ఫీలవుతారు. మొత్తంగా యాక్షన్ భాగం ఎక్కువగా ఇంపాక్ట్ క్రియేట్ చేసే ధ్రువ సినిమా పబ్లిసిటీని సురేందర్ రెడ్డి ఇలాంటి పోస్టర్లతో మొదలెడితే ఇది సుకుమార్ సినిమా అని ప్రేక్షకులు అనుకునే పెనుప్రమాదమే ఉంది. ఇలా అయితే B, C సెంటర్ వీక్షకుల్లో ధ్రువ పట్ల విచిత్రమైన ఆలోచనలు రేకెత్తి మొదటికే ప్రమాదం వచ్చే అవకాశం లేకపోలేదు. ముందు సినిమా తీయండి సామీ, తరువాత ప్రేక్షకులని భయభ్రాంతులకు గురి చేద్దూరులే...

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement