Advertisementt

కేర్ ఆసుపత్రి డాక్టరమ్మతో క్రిష్ వివాహం!

Sat 11th Jun 2016 02:03 PM
director krish marriage,dr velaga ramya  కేర్ ఆసుపత్రి డాక్టరమ్మతో క్రిష్ వివాహం!
కేర్ ఆసుపత్రి డాక్టరమ్మతో క్రిష్ వివాహం!
Advertisement
Ads by CJ

ప్రముఖ దర్శకుడు జాగర్లమూడి క్రిష్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సినిమాయే ధ్యాసగా, సినిమా కోసం వ్యక్తిగతంగా త్యాగాలు చేసిన ఎందఱో వ్యక్తులు నేడు అత్యున్నత స్థానాల్లో ఉన్నారు. అదే కోవలో నడుస్తూ,   ఇండస్ట్రీలో సరైన గుర్తింపు కోసం పెళ్లిని కూడా పక్కన పెట్టేసి అహర్నిశలు శ్రమించి నేడు స్టార్ దర్శకుడిగా వెలుగొందుతున్న క్రిష్ చివరికి అమ్మకి ఇచ్చిన మాటకు విలువనిస్తూ వివాహం చేసుకోబోతున్నాడు. కేర్ ఆసుపత్రిలో డాక్టరుగా పని చేస్తూ, శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న వెలగ రమ్యను రానున్న ఆగస్టు నెలలో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమే. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు తరఫు బంధువులు అన్నీ చర్చించుకుని ఓ దివ్యమైన ముహూర్తంలో ఈ జంటను ఒక్కటి చేయబోతున్నారు. గమ్యం నుండి తన ప్రయాణాన్ని మొదలెట్టిన క్రిష్ ప్రస్తుతం బాలకృష్ణ 100వ చిత్రం గౌథమిపుత్ర శాతకర్ణికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఏడాది పెళ్లి, వచ్చే ఏడాది మొదట్లో సినిమా రిలీజ్... ఉందిలే మంచి కాలం ముందుముందునా... ఏమంటావ్ క్రిష్...

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ