పవన్ కాదు..ముందు నీ సంగతి చూసుకోవయ్యా!

Fri 10th Jun 2016 08:03 PM
pawan kalyan v hanumantha rao,andhra pradesh,telangana,kaapu reservation  పవన్ కాదు..ముందు నీ సంగతి చూసుకోవయ్యా!
పవన్ కాదు..ముందు నీ సంగతి చూసుకోవయ్యా!
Sponsored links

కాపు నేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్ష నాటకీయపరిణామాల మధ్య భగ్నం అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ వ్యవహారం కేవలం ఏపీకి చెందిన సమస్య. ఇందులో తెలంగాణ నాయకులు కల్పించుకోవాల్సిన అవసరం లేదు. పవన్‌కళ్యాణ్‌ జనసేన పార్టీ పెట్టినప్పుడు ఆయన విశ్వసనీయతను, నాయకత్వ లక్షణాలను ఎంతగానో విమర్శించిన తెలంగాణ కాంగ్రెస్‌ వృధ్దనాయకుడు వి.హన్మంతరావు ఇప్పుడు ఏపీ ఎదుర్కొంటున్న కాపు రగడకు ఆజ్యం పోసే ప్రయత్నం చేస్తున్నాడు. ముందు ఆయన తన రాష్ట్రం అయిన తెలంగాణ సంగతి? అక్కడ కాంగ్రెస్‌ పరిస్థితిపై దృష్టి పెడితే మంచిది? ఆయన మాట్లాడుతూ కాపుల రిజర్వేషన్లపై పవన్‌ తన పంథా ఏమిటో చాటాలని, ఆయన కాపు రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నాడా? లేదా? అనే విషయం ముందు తేల్చాలని ఆయన డిమాండ్‌ చేస్తున్నాడు. 'పనిలేని వాడు ...' అనే మోతు సామెత ఇక్కడ గుర్తుకు వస్తుంది. ప్రస్తుతం విహెచ్‌ రాజ్యసభ పదవి పోవడంతో పనిపాటా లేకుండా ఉన్నాడు. పనిలో పనిగా టికాంగ్రెస్‌లో ముసలం పుట్టించడానికి కృషి చేస్తూ తాను టిపిసిసి ఛీఫ్‌ కావాలని కోరుకుంటున్నాడు. ఇప్పటికైనా విహెచ్‌ ఏపీ సంగతి వదలి, తన రాష్ట్ర పరిస్థితులపై దృష్టి మరలిస్తే అది ఆయనకే మేలు. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019