Advertisementt

మామా అల్లుళ్ల ప్లాన్‌ అదిరింది..!

Tue 07th Jun 2016 06:48 PM
chota k naidu,sandeep kishan,okka ammayi thappa movie,mama allulla plan,nithya menon  మామా అల్లుళ్ల ప్లాన్‌ అదిరింది..!
మామా అల్లుళ్ల ప్లాన్‌ అదిరింది..!
Advertisement
Ads by CJ

యంగ్‌ హీరో సందీప్‌కిషన్‌.. ఒక్కో చిత్రంతో ఒక్కో మెట్టు ఎదగాలని భావిస్తున్న ఆర్టిస్ట్‌. తన మేనమామ చోటా కె.నాయుడు బ్యాగ్రౌండ్‌తో తెలుగులోనే కాదు తమిళంలో కూడా ఈ హీరో చిత్రాలు చేస్తూనే ఉన్నాడు. అయితే ఇతని హీరో కెరీర్‌లో 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' మాత్రమే పెద్ద హిట్‌ను నమోదు చేసింది. ఆ తర్వాత వచ్చిన చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద పల్టీ కొడుతున్నప్పటికీ ఆయనకు అవకాశాలు మాత్రం వెతుక్కుంటూనే వస్తున్నాయి. ఆయన తాజాగా నిత్యామీనన్‌తో కలిసి నటిస్తున్న 'ఒక్క అమ్మాయి తప్ప' చిత్రం ఈనెల 10న విడుదలకు సిద్దమవుతోంది. ఈ చిత్రానికి రచయిత రాజసింహ దర్శకుడు. ఈ చిత్రానికి సందీప్‌కిషన్‌తో పాటు ఆయన మేనమామ, సినిమాటోగ్రాఫర్‌ చోటా కె నాయుడు కూడా ఎలాంటి పారితోషికం తీసుకోలేదట. ఈ చిత్రం హిట్టయి లాభాలు వస్తే అప్పుడు రెమ్యూనరేషన్‌ తీసుకుంటామని చెప్పి ఉచితంగా పనిచేశారట. మొత్తానికి మేనమామ మార్గదర్శకంలో ఈ హీరో మంచి నిర్ణయాలే తీసుకుంటూ హిట్‌ సినిమాలు కాకపోయినా అవకాశాలు మాత్రం సాధిస్తూనే ఉన్నాడని అర్ధమవుతోంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ