Advertisementt

త్రివిక్రమ్‌ రెమ్యూనరేషన్‌ తీసుకున్నాడంట!

Sat 04th Jun 2016 07:39 PM
trivikram srinivas,a aa movie,trivikram srinivas remuneration for a aa,nithiin,a aa movie collections  త్రివిక్రమ్‌ రెమ్యూనరేషన్‌ తీసుకున్నాడంట!
త్రివిక్రమ్‌ రెమ్యూనరేషన్‌ తీసుకున్నాడంట!
Advertisement
Ads by CJ

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రాధాకృష్ణ నిర్మాతగా హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ బేనర్‌లో నితిన్‌ హీరోగా సమంత కీలకపాత్రలో నటించిన చిత్రం 'అ..ఆ'. ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు ఓవర్‌సీస్‌లో కూడా అదరగొడుతోంది. కాగా ఈ చిత్రాన్ని నిర్మాత రాధాకృష్ణ చాలా రీజనబుల్‌ రేట్లకు అమ్మాడని, 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌, బ్రహ్మూెత్సవం' వంటి భారీ డిజాస్టర్స్‌తో పెద్ద సినిమాలు అంటేనే భయపడుతున్న బయ్యర్లకు 'అ...ఆ' చిత్రం మంచి లాభాలనే అందిస్తుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే ఈ సినిమా ఏప్రిల్‌ లేదా మే నెలలో వచ్చి ఉంటే సమ్మర్‌ సీజన్‌ను క్యాష్‌ చేసుకొని ఇంకా పెద్ద హిట్‌గా నమోదయి ఉండేదని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి జూన్‌ అంటే తిరిగి విద్యార్ధులు నూతన విద్యాసంవత్సరంలోకి ఎంటర్‌ అయ్యే సీజన్‌ కాబట్టి జూన్‌ నెలను సినిమాలకు ఇబ్బందికర నెలగా భావిస్తారు. అయితే నిర్మాత ఈ చిత్రానికి సంబంధించి త్రివిక్రమ్ కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెబుతున్నా.. చిత్రానికి త్రివిక్రమ్‌ 15కోట్ల రెమ్యూనరేషన్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయినా కూడా 'అత్తారింటికిదారేది' చిత్రంతో టాప్‌ డైరెక్టర్ల సరసన తన పేరు లిఖించుకున్న త్రివిక్రమ్‌కు అంత మొత్తం పారితోషికం ఇవ్వడం సమంజసమేనని, ఈ రోజున ఈ చిత్రం ఇంత మంచి ఓపెనింగ్స్‌ సాధిస్తుండటానికి మొదటి కారణం త్రివిక్రమే అని ట్రేడ్‌ వర్గాలు ఒప్పుకొంటున్నాయి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ