Advertisement

కేసీఆర్‌ పై ఇప్పుడు ఫైర్ అయ్యి ఏం లాభం?

Sat 04th Jun 2016 01:45 PM
kcr,fair,jaipal reddy,state division credit,congress  కేసీఆర్‌ పై ఇప్పుడు ఫైర్ అయ్యి ఏం లాభం?
కేసీఆర్‌ పై ఇప్పుడు ఫైర్ అయ్యి ఏం లాభం?
Advertisement

కేంద్రమాజీ మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు జైపాల్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఢిల్లీలో మంత్రాంగాలు నడిపి మొత్తానికి అధిష్టానాన్ని ఒప్పించాడు. కానీ తెలంగాణ క్రెడిట్‌ అటు రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు, మద్దతు ఇచ్చిన బిజెపిలకు కాకుండా ఏకమొత్తంగా ఆ క్రెడిట్‌ మొత్తం కేసీఆర్‌ స్వంతం చేసుకున్నాడు. కాగా తెలంగాణ సాధనలో కేసీఆర్‌ నిరాహార దీక్ష ప్రముఖ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కేసీఆర్‌ చేసింది దొంగ దీక్ష అని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు ఈ విషయాన్ని జైపాల్‌రెడ్డి ఒప్పుకున్నాడు. నాడు కేసీఆర్‌ దొంగ దీక్ష చేశాడని, ఆ ఫైల్స్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో ఉన్నాయంటూ కేసీఆర్‌ను ఘాటుగా విమర్శించాడు. అయినా కాంగ్రెస్‌ పరిస్థితి మాత్రం తెలంగాణలో, ఏపీలో దీనంగా మారింది. రాష్ట్ర విభజన చేయడం ద్వారా ఏపీ ప్రజలకు, తెలంగాణ ఇచ్చినప్పటికీ ఆ క్రెడిట్‌ కాంగ్రెస్‌కు రాకపోవడం అనేది కాంగ్రెస్‌ చేసుకున్న స్వయంకృతాపరాధం అని చెప్పాలి. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement