Advertisementt

పవన్ కి నో.. నానికి ఓకే!

Fri 03rd Jun 2016 07:20 PM
keerthi suresh,pawan kalyan,nani,dhanush,vijay  పవన్ కి నో.. నానికి ఓకే!
పవన్ కి నో.. నానికి ఓకే!
Advertisement
Ads by CJ

'నేను శైలజ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన నటి కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ భామకు తెలుగులో మంచి అవకాశాలే వచ్చాయి. తమిళంలో కూడా తను నటించిన మొదటి సినిమా హిట్ కావడంతో అక్కడ కూడా అమ్మడుకి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. దీంతో తెలుగులో సినిమాలు ఒప్పుకోకుండా కోలీవుడ్ కే తన ప్రిఫరెన్స్ ఇస్తోంది. తమిళంలో విజయ్, ధనుష్ వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంటుంది. ఈ నేపధ్యంలో రీసెంట్ గా కీర్తిని పవన్ సినిమాలో హీరోయిన్ గా నటించమని అడిగారు. డేట్స్ కుదరవని చెప్పి తప్పించుకుంది. అయితే నాని హీరోగా, త్రినాధరావు నక్కిన ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి అయితే బావుంటుందని భావించి తనను సంప్రదించారు. కథ విని వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకుందని సమాచారం. పవన్ కు నో చెప్పి నాని కి ఓకే చెప్పడం పట్ల ఈ అమ్మడు ఉద్దేశ్యం ఏంటో..? ఆమెకే తెలియాలి. దీంతో అయినా.. ఇక వరుసగా తెలుగులో సినిమా చేస్తుందేమో చూడాలి..!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ