Advertisementt

ఇదంతా 'ధ్రువ‌' కోస‌మేనా చరణ్!

Thu 26th May 2016 10:42 PM
ram charan,dhruva,vegetarian,ram charan change for dhruva,surendar reddy,face book  ఇదంతా 'ధ్రువ‌' కోస‌మేనా చరణ్!
ఇదంతా 'ధ్రువ‌' కోస‌మేనా చరణ్!
Advertisement
Ads by CJ

సినిమా కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డ‌వారినైనా చూసుంటాం. మాంసాహారులు శాకాహారులుగా మారిపోవ‌డం రీసెంట్‌గా చూస్తున్నాం. బాలీవుడ్‌లో  య‌మా జోరుగా సాగుతున్న ఈ ట్రెండ్ ఇప్ప‌డు టాలీవుడ్‌కు కూడా వ‌చ్చేసింది. 'ధ్రువ‌' కోసం రామ్‌చ‌ర‌ణ్ శాకాహారిగా మారిపోయాడు. ఆకు కూర‌లు, కూర‌గాయ‌లు తింటూ సినిమా కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు. అన్నట్టు... ఈ సినిమా పేరు 'ధ్రువ‌' అని ఆనోటా ఈనోటా విన‌డ‌మే కానీ సినిమాకు సంబంధించిన వారెవ‌రూ చెప్ప‌లేదు. తొలిసారిగా రామ్‌చ‌ర‌ణ్ ఈ మాట చెప్పాడు. ఫేస్‌బుక్‌లో ఈ శాకాహారం విష‌యం రాస్తూ 'ధ్రువ‌' కోస‌మే ఇదంతా అని రాశాడు. దీంతో సినిమాకు నామ‌క‌ర‌ణం జ‌రిగిపోయిన‌ట్టే. ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ పోలీసు ట్రైనింగ్ తీసుకుంటున్న యువ‌కుడిగా, పోలీసుగా క‌నిపించనున్నాడు. పోలీసు అంటే ఆ మాత్రం ఉండాలి మ‌రి. అందుకే సినిమాలో స‌రికొత్త‌గా క‌నిపించ‌డానికి రామ్‌చ‌ర‌ణ్ శ‌రీరాన్ని మ‌లుచుకుంటున్నాడు. అందుకే ఈ శాకాహార మంత్రం. 'గోవిందుడు అంద‌రివాడేలే', 'బ్రూస్‌లీ' ప‌రాజయాల‌తో ట్రాక్ త‌ప్పిన చెర్రీని ఇదైనా స‌క్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ