'సర్దార్ గబ్బర్‌సింగ్' చిత్రం తీవ్రంగా నిరాశ మిగిల్చి డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. దీంతో పవన్ తాను తాజాగా చేస్తోన్న ఎస్.జె.సూర్య చిత్రం హక్కులను 'సర్దార్ గబ్బర్‌సింగ్' డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు సబ్సిడీపై ఇవ్వడానికి డిసైడ్ అయ్యాడు. అదే వేరే నిర్మాతతో చిత్రం చేస్తే ఇబ్బందులు వస్తాయని గ్రహించిన పవన్ ఈ చిత్రాన్ని కూడా తన స్నేహితుడు, 'సర్దార్ గబ్బర్‌సింగ్' నిర్మాత శరత్‌మరార్‌కే చేస్తున్నాడు. కాగా ఈ చిత్రం కోసం పవన్ 25కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది. మరోపక్క మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రానికి సంబంధించిన ప్రీపొడక్షన్ పనులు వేగంగా పూర్తవుతున్నాయి. తమిళ 'కత్తి'కి రీమేక్‌గా వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్నిరామ్‌చరణ్ తమ కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్‌లో లైకా ప్రొడక్షన్స్ భాగస్వామ్యంతో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో నటించినందుకు చిరంజీవికి 30కోట్ల పారితోషికం ఇవ్వాలని రామ్‌చరణ్.. లైకా ప్రొడక్షన్స్ అధినేతలకు సూచించాడట. ఇదే నిజమైతే టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఎవ్వరూ తీసుకోనంత పారితోషికాన్ని చిరు, ఆ తర్వాత స్ధానాన్ని పవన్ సాధించినట్లే అని మెగాభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.