Advertisementt



సూర్యా... తెలుగువారంటే అంత చిన్న చూపా!

Thu 19th May 2016 03:01 PM
actor suriya,24 movie,24 movie telugu ratings,tamil ratings,tamil media  సూర్యా...  తెలుగువారంటే అంత చిన్న చూపా!
సూర్యా... తెలుగువారంటే అంత చిన్న చూపా!
Advertisement
Ads by CJ

తెలుగులో సూర్య నటించిన 24 సినిమా ఎంత హిట్ అయ్యిందో తెలుగు వెబ్ సైట్స్  రాసిన రివ్యూ లు చూస్తేనే అర్ధం అవుతుంది. సూర్య 24 సినిమా తమిళం  కంటే తెలుగులోనే ఎక్కువ మార్కులు పడ్డాయి. కలక్షన్స్ పరం గా కూడా తమిళం కంటే తెలుగులోనే ఎక్కువ వచ్చాయి. ఇక్కడి సినిమా విశ్లేషకులు సూర్య 24 సినిమా ని ఆకాశానికి  ఎత్తేసారు.  కాని అసలు విషయం ఏమిటంటే సూర్య ఈ సినిమాని అస్సలు తెలుగులో అనుకున్నత పబ్లిసిటీ చేసుకోలేదు.  పోనీ సినిమా విజయం సాధించిన తర్వాత కూడా ఈ సినిమా గురుంచి ఒక సక్సెస్స్ మీట్ కాని ఒక థాంక్స్ మీట్ గాని పెట్టలేదు. కనీసం మీడియా కి కృతజ్ఞత కూడా తెలపలేదు. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు అదే ఫీల్ అవుతున్నారు. తమిళ్ సినిమాలు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసినా... సినిమా బావుంటే దానిని నెత్తిన పెట్టుకుంటారు మన తెలుగు ప్రేక్షకులు. ఈ సినిమా హిట్ అయిన సందర్భం గా 24 యూనిట్ ఒక పోస్టర్ ని విడుదల చేసింది. ఆ పోస్టర్ లో తమిళ్ మీడియాను,  వెబ్సైట్స్ ను ఆకాశానికి ఎత్తేస్తూ తెలుగు రాష్ట్రాలలో అనేకచోట్ల ఈ పోస్టర్స్ దర్శనమిస్తున్నాయి. . మన తెలుగులో హిట్ అయిన 24 సినిమా గురుంచి ఎక్కడా ప్రమోట్ చెయ్యకుండా తమిళ మీడియాని ప్రస్తావించడం పై  తెలుగు ప్రేఖకులు మరియు మీడియా కూడా సూర్య పై గుర్రుగా వున్నారు. మనము తమిళ్ వాళ్ళని ఎంతగా ఆదరిస్తాము కాని.... తమిళులకి మనల్ని చూస్తె ఎప్పుడు చిన్న చూపే అనేది దీన్ని బట్టి అర్ధం అవుతుంది.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ