Advertisementt

ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమాకు అన్ని వ్యూసా..?

Tue 17th May 2016 07:13 PM
ntr,dammu movie,boyapati srinu,janatha garage  ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమాకు అన్ని వ్యూసా..?
ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమాకు అన్ని వ్యూసా..?
Advertisement
Ads by CJ

నందమూరి నట వారసుడు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి తన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ.. అభిమానులను సంపాదించుకున్నాడు. 'టెంపర్','నాన్నకు ప్రేమతో' చిత్రాలతో హిట్స్ కొట్టిన ఈ హీరో ప్రస్తుతం 'జనతా గ్యారేజ్' సినిమాలో నటిస్తున్నాడు. అయితే రీసెంట్ గా ఎన్టీఆర్ ఒక వార్త విని షాక్ తిన్నాడట. అసలు విషయంలోకి వస్తే ఎన్టీఆర్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సినిమా 'దమ్ము'. 2012 లో తెలుగులో విడుదలయిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ సినిమాను హిందీలో 'సుల్తాన్' పేరిట డబ్ చేశారు. అలా డబ్ చేసిన సినిమాను నెల పదిహేను రోజుల క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. అయితే నెల పదిహేను రోజుల్లోనే ఈ సినిమా సుమారుగా కోటి వ్యూస్ కు దగ్గరవుతుంది. నెటిజన్స్ ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు. తెలుగులో ఘోర పరాజయం పొందిన తన సినిమా యూట్యూబ్ లో కోటి వ్యూస్ కు చేరువవ్వడంతో ఎన్టీఆర్ సైతం షాక్ అయ్యాడట.   

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ