Advertisementt

విక్రమ్‌ కుమార్‌ అనుకున్నది సాధిస్తాడా?

Tue 17th May 2016 12:54 PM
vikram k kumar,24 movie,mahesh babu,allu arjunj,vikram k kumar movies  విక్రమ్‌ కుమార్‌ అనుకున్నది సాధిస్తాడా?
విక్రమ్‌ కుమార్‌ అనుకున్నది సాధిస్తాడా?
Advertisement
Ads by CJ

'ఇష్క్‌, మనం, 24' చిత్రాల ద్వారా మాస్టర్‌మైండ్‌గా కితాబు అందుకుంటున్న దర్శకుడు.. విక్రమ్‌ కె.కుమార్‌. '24' చిత్రం సాధిస్తోన్న విజయంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. వాస్తవానికి ఆయన '24' చిత్రం కథను మహేష్‌తో పాటు మరి కొందరు టాలీవుడ్‌ స్టార్స్‌కి కూడా చెప్పాడు. కానీ వారు అలాంటి ప్రయోగం తాము చేయలేమని తేల్చారు. వాస్తవానికి ఈ చిత్రం చేయడం సూర్యకే సాధ్యం. ముఖ్యంగా ఆత్రేయ క్యారెక్టర్‌ చూసిన వారికి సూర్యకు ఆల్టర్‌నేటివ్‌ ఎవ్వరూ లేరని అనిపిస్తుంది. అందుకే ఈ చిత్రాన్ని మహేష్‌ రిజెక్ట్‌ చేయడం గుడ్‌ డెసిషన్‌గా అందరూ భావిస్తున్నారు. మహేష్‌కు ఉన్న క్రేజ్‌, ఇమేజ్‌ దృష్ట్యా 'నాని, నిజం' వంటి చిత్రాల్లో మహేష్‌ ప్రయోగం చేసినప్పటికీ అవి ప్రేక్షకాదరణ పొందలేకపోయాయి. ఇక మహేష్‌ను కానీ, మరో తెలుగు స్టార్‌ను కానీ విలన్‌ రోల్‌గా మన ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. అందుకే ఈ చిత్రం సూర్యకి మాత్రమే సాధ్యం. కాగా విక్రమ్‌కెకుమార్‌ త్వరలో అల్లుఅర్జున్‌, మహేష్‌బాబులతో సినిమాలు చేయనున్నాడు. బన్నీతో ఇండియన్‌ స్క్రీన్‌ మీద ఇప్పటివరకు ఎవ్వరూ టచ్‌ చేయని సబ్జెక్ట్‌ను రెడీ చేస్తున్నానని విక్రమ్‌ ప్రకటించాడు. ఆ తర్వాత ఆయన మహేష్‌తో సినిమా చేయనున్నాడు. మరి విక్రమ్‌ కుమార్‌ తీసే వెరైటీ కాన్సెప్ట్‌లు మన స్టార్‌ హీరోలకు సూట్‌ అవుతాయా? వారికి సూట్‌ అయ్యేటట్లు విక్రమ్‌ సినిమాలు తీసి మెప్పించగలడా? లేక మన స్టార్స్‌ని దృష్టిలో ఉంచుకొని తాను కూడా వారి స్దాయికి తగ్గ సబ్జెక్ట్‌లనే చేస్తాడా? వంటి అనేక అనుమానాలు ప్రస్తుతం అందరిలో కలుగుతున్నాయి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ