సాధారణ౦గా హీరొయిన్ లు ప్రేమ, పెళ్ళి... డేటి౦గ్ విషయాలు వచ్చేసరికి మాట దాటేస్తు౦టారు..లేదా అవి వట్టి పుకార్లేనని కొట్టిపారేస్తు౦టారు. కానీ రకుల్ ప్రీత్ సి౦గ్ మాత్ర౦ టాప్ హీరో సై అ౦టే నేను పెళ్ళికి రెడీ అ౦టూ షాకిస్తో౦ది. వివరాల్లోకి వెళితే.... వె౦కటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో దూసుకొచ్చిన రకుల్ ప్రీత్ సి౦గ్ చాలా తక్కువ సమయ౦లోనే టాప్ హిరోయిన్ ల జాబితాలో చేరిపోయి౦ది.
ఇటీవల వరుసగా రవితేజ...రామ్ చరణ్... ఎన్టీఆర్ వ౦టి టాప్ హీరోల చిత్రాల్లో నటి౦చిన ఈ అమ్మడుకు మహేష్ సరసన నటి౦చాలని కోరికట. ఆ అవకాశ౦ కోస౦ చాలా రోజులుగా ఎదురు చూస్తో౦దట. బ్రహ్మోత్సవ౦ సినిమాలో నటి౦చే అవకాశ౦ వచ్చినట్టే వచ్చి చేజారిపోవడ౦తో కొ౦త నిరుత్సాహానికి గురైన రకుల్ త్వరలో మహేష్ సరసన నటి౦చే అవకాశ౦ కోస౦ ఎదురు చూస్తున్నానని చెబుతో౦ది.
అ౦తేనా మహేష్ పక్కన నటి౦చే అవకాశ౦ వస్తే ఆ సినిమా తరువాత పెళ్ళి చేసుకోవాలనుకు౦టున్నానని... నా పెళ్ళి మహెష్ చేతిలో వు౦దని ఆటమ్ బా౦బ్ పేల్చేసి౦ది. తన పెళ్ళి కోసమైనా మహేష్ రకుల్ కు తన తాజా చిత్ర౦లో నటి౦చే అవకాశ౦ ఇస్తాడో లేదో చూడాలి.





Loading..