Advertisement

మంత్రివర్గ విస్తరణపై కేసీఆర్‌ కసరత్తు!

Sun 15th May 2016 02:54 PM
kcr,rajyasabha elections,changes in telangana cabinet ministers,telangana  మంత్రివర్గ విస్తరణపై కేసీఆర్‌ కసరత్తు!
మంత్రివర్గ విస్తరణపై కేసీఆర్‌ కసరత్తు!
Advertisement

రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైన సమయంలో తన మంత్రివర్గాన్ని పునర్‌వ్యవస్థీకరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కసరత్తులు మొదలుపెట్టాడు. ప్రస్తుతం మంత్రి వర్గంలో ఉన్న జోగురామన్న, జూపల్లి కృష్ణారావు, పద్మారావ్‌ గౌడ్‌, నాయిని నరసింహారెడ్డి, చందులాల్‌లకు ఉద్వాసన చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. జూపల్లి కృష్ణారావు స్ధానంలో కొత్తగా పార్టీలో చేరిన ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అవకాశం ఇచ్చే ఉద్దేశంలో కేసీఆర్‌ ఉన్నాడు. చందులాల్‌ స్థానంలో ఎస్టీ కోటా కింద ఆసిఫాబాద్‌ ఎమ్మేల్యే కోవా లక్ష్మీకి స్ధానం కల్పించే అవకాశం ఉంది. ఇక డిప్యూటీ స్పీకర్‌గా పనిచేస్తున్న పద్మా దేవేందర్‌రెడ్డికి, వరంగల్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా సురేఖకు బెర్త్‌లు కన్ఫర్మ్‌ అయ్యాయని సమాచారం. ఇక కేసీఆర్‌కు నమ్మకస్తుడైన కొప్పుల ఈశ్వర్‌కు పదవి లభించనుందని తెలుస్తోంది. కాగా కాంగ్రెస్‌ నుండి టిఆర్‌ఎస్‌లో చేరిన సీనియర్‌ నేత డి.శ్రీనివాస్‌కు రాజ్యసభ సీటు ఇవ్వాలా? లేక అదే సామాజిక వర్గానికి చెందిన జోగురామన్న స్ధానంలో మంత్రి పదవి ఇవ్వాలా? అనే అంశంతోపాటు నాయిని నరసింహారెడ్డిని రాజ్యసభకు పంపాలా? లేక పార్టీ సేవల కోసం వినియోగించుకోవాలా? అనే అంశాలపై కేసీఆర్‌ కసరత్తు మొదలు పెట్టాడు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement