అభయ్ ని ఎత్తుకుంది, సితారతో కబుర్లు !

Thu 12th May 2016 11:16 AM
samantha,brahmotsavam sets,janatha garage sets,abhay ram,sitara  అభయ్ ని ఎత్తుకుంది, సితారతో కబుర్లు !
అభయ్ ని ఎత్తుకుంది, సితారతో కబుర్లు !
Sponsored links

సమంత తన గురించి కాకుండా హీరోల పిల్లల గురించి ఎక్కువగా ఆలోచిస్తోంది. ఎందుకంటే ఫ్యామిలీ హీరోలతో ఎక్కువగా నటిస్తుండమే కారణం కావచ్చు.  షూటింగ్ విరామంలో ఆ హీరోలు తమ ఫ్యామిలీతో లొకేషన్ లో సందడి చేస్తున్నారు. భార్య, పిల్లలను సరదాగా లొకేషన్ కు పిలిపించుకుని కొద్ది సేపు గడపడం మన టాలీవుడ్ హీరోలకు అలవాటు. మహేష్ బాబు పిల్లలు గౌతమ్, సితార తరచుగా లొకేషన్ కి వస్తుంటారు. తండ్రితో కొద్దిసేపు గడుపుతారు. హీరో పిల్లలు సెట్లోకి వస్తే యూనిట్ సభ్యులు సైతం అలర్ట్ గా ఉంటారు. వారిని ముద్దుచేస్తారు. సమంత కూడా అంతే బ్రహ్మోత్సవం సెట్లో మహేష్ తనయ సితారను దగ్గరకు తీసుకుని కబుర్లు చెప్పింది. కొద్దిసేపు ఆడుకుంది. అందుకే భవిష్యత్తులో సితార స్టార్ హీరోయిన్ అవుతుందని కితాబునిచ్చింది. ఇక జనతా గ్యారేజ్ సెట్లో కూడా సమంత సేమ్ సీన్ రిపీట్ చేసింది. జూ.ఎన్టీఆర్ కుమారుడు మాస్టర్ అభయ్ ఇటీవల లొకేషన్ కు వచ్చాడు. అభయ్ ను చూడగానే సమంత ముచ్చటపడింది. ఎత్తుకుని, కొద్దిసేపు ఆడించింది. అభయ్ కు పూర్తిస్థాయి మాటలు రావుకాబట్టి కబుర్లు చెప్పలేకపోయింది. అయితే అభయ్ గురించి మాత్రం ఎలాంటి జోష్యం చెప్పలేదు. భవిష్యత్తులో స్టార్ హీరో అవుతాడని సర్టిఫికెట్ కూడా ఇవ్వలేదు. ఇదంతా చూస్తుంటే సమంతకు పిల్లలంటే మహా సరదాగా ఉన్నట్టు అనిపిస్తోంది. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019