మెగాస్టార్ తో రెజీనా..?

Fri 06th May 2016 04:25 PM
regina cassandra,megastar chiranjeevi,vinayak  మెగాస్టార్ తో రెజీనా..?
మెగాస్టార్ తో రెజీనా..?
Sponsored links

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఇటీవల ప్రారంభమయిన సంగతి తెలిసిందే. చిరంజీవి, వినాయక్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా గురించి మొదటి నుండి ఏదొక వార్త వస్తూనే ఉంది. ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ గా నయనతార లేదా అనుష్క నటించనున్నారనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ లిస్టులోకి మరో హీరోయిన్ చేరింది. మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్ లతో జత కట్టిన రెజీనాకు చిరు 150లో అవకాశం వచ్చిందట. అయితే హీరోయిన్ గా మాత్రం కాదు. ఈ సినిమాలో చిరంజీవి అభిమానులను ఆకట్టుకునే విధంగా ఒక స్పెషల్ సాంగ్ ను ప్లాన్ చేశారట. ఈ పాటలో చిరు సరసన ఆడిపాడే ఛాన్స్ రెజీనాకు దక్కిందని సమాచారం. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాల్సివుంది..!

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019