ఇకపై మిల్కీబ్యూటీ అలా చేయదంట!

Thu 05th May 2016 12:43 PM
tamanna,oopiri,tamanna inner feeling,tamanna movies,tamanna in chiru 150th movie  ఇకపై మిల్కీబ్యూటీ అలా చేయదంట!
ఇకపై మిల్కీబ్యూటీ అలా చేయదంట!
Sponsored links

'బాహుబలి-ది బిగినింగ్‌' చిత్రంలో అవంతికగా అదరగొట్టిన తమన్నా ఆ తర్వాత వచ్చిన 'ఊపిరి' చిత్రం ద్వారా కూడా తన సత్తా చాటుకుంది. కాగా ఈ అమ్మడు ఏడుపు తెప్పించే సినిమాలకు దూరంగా ఉంటుందిట. ఆ తరహా చిత్రాలు నాకు చేయబుద్ది కాదు... నా ఉద్దేశ్యంలో సినిమా అంటే ఆనందమే. అందుకే కాసేపు ఆనందాన్ని ఇచ్చే సినిమాలను చూడటానికి ఇష్టపడుతాను, మెదడుకు పని చెప్పి మన ఆలోచనలను మంచి వైపుకి తీసుకెళ్లే సినిమాలన్నా నాకు ఇష్టమే. కానీ తెరపై ఏడుపుని మాత్రం నేను భరించలేను... అంటూ తన అభిప్రాయాన్ని చెప్పింది మిల్కీబ్యూటీ తమన్నా. తమిళ్‌లో ఆమె ప్రస్తుతం 'ధర్మదురై' చిత్రంతో పాటు విశాల్‌ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. ఇక 'అభినేత్రి, బాహుబలి-2' చిత్రాలలో కూడా ఆమె నటిస్తోంది. మొత్తానికి 'బెంగాల్‌టైగర్‌, బాహుబలి, ఊపిరి' చిత్రాలతో హ్యాట్రిక్‌ కొట్టి ముందుకొస్తున్న ఈ భామ త్వరలో సెట్స్‌పైకి వెళ్లే మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం 'కత్తి' రీమేక్‌లో చిరు సరసన నటించనుందని ఫిల్మ్‌నగర్‌ వర్గాల సమాచారం. 

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019