Advertisementt

నితిన్ నాకు తమ్ముడిలా అనిపించాడు: పవన్!

Tue 03rd May 2016 02:35 PM
pawan kalyan,a aa movie,trivikram srinivas,nithin  నితిన్ నాకు తమ్ముడిలా అనిపించాడు: పవన్!
నితిన్ నాకు తమ్ముడిలా అనిపించాడు: పవన్!
Advertisement
Ads by CJ

నితిన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'అ ఆ'. ఈ సినిమా ఆడియో రిలీజ్ కు అతిథిగా విచ్చేసిన పవన్ కళ్యాణ్ నితిన్, త్రివిక్రమ్ లతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. సినిమా హిట్ కావాలని కోరుకున్నాడు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ''స్టేజీ మీద నేను ధైర్యంగా మాట్లాడతాననుకుంటారు కాని నాకు బయటకు వచ్చి మాట్లాడాలంటే సిగ్గు. మనసులో బెరుకు బెరుకుగా ఉంటుంది. నితిన్ కు నేనంటే ఎంత ఇష్టమో ఈరోజే తెలిసింది. తనకు ఈ సినిమా పెద్ద విజయం సాధించి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. నేను నా సినిమాలు తప్ప పక్కన సినిమాలను పట్టించుకోను. కాని ఇష్క్ సినిమా సమయంలో నితిన్ ను చూసినప్పుడు నాకు తమ్ముడి లాగా అనిపించాడు. అందుకే ఆ సినిమా ఆడియో ఫంక్షన్ కు వెళ్లాను. తెలుగులోనే కాదు భారతదేశంలో హీరోగా తనకు మంచి పేరు రావాలి. మిక్కీ మ్యూజిక్ వినసొంపుగా ఉంది. లిరిక్స్ అద్భుతంగా ఉన్నాయి. సమంత, నదియలకు నా బెస్ట్ విషెష్. చినబాబు గారు అండగా ఉండే నిర్మాత. ఆయనంటే నాకు చాలా ఇష్టం. త్రివిక్రమ్ 'గోకులంలో సీత' సినిమాకు అసిస్టెంట్ రైటర్ గా పని చేశారు. ఆ సినిమాకు ఎక్కువ శాతం ఆయనే డైలాగ్స్ రాశారు అప్పటికి ఆయనతో అంత పరచయం లేదు. చిరునవ్వుతో సినిమా రషెష్ చూశాను. ఒక సీన్ చూడగానే డైలాగ్స్ బాగా నచ్చాయి. ఆరోజు నుండి ఆయనతో ఉన్న పరిచయం కేవలం సినిమా తీయడం మాత్రమే కాదు. నిజజీవితంలో విలువలు పాటించే వ్యక్తి కాబట్టి ఆయనంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. మా ఇద్దరి మధ్య స్నేహం ఒకరి మీద ఒకరం గౌరవ ప్రధంగా ఉంటాం. నటుడు అనేవాడు రైటర్ రాసిన డైలాగ్స్ ను చెప్పేవాడే కాని రాసేవాడు కాదు. నేను రచయితలను గౌరవిస్తాను. హీరోకు మంచి ఇమేజ్ వచ్చిందంటే దాని వెనుక రచయిత కథ ఉందని బలంగా నమ్మే వ్యక్తిని నేను. అలాంటి ఇమేజ్ త్రివిక్రమ్ నాతో పాటు చాలా మంది హీరోలకు ఇచ్చాడు. ఇలాంటి రచయిత తెలుగు ఇండస్ట్రీలో ఉండడం ఇండస్ట్రీ గర్వించదగ్గ విషయం. అత్తారింటికి దారేది కంటే ముందే నాకు ఈ సినిమా కథ తెలుసు. కుటుంబంతో చూడదగ్గ చక్కటి ఫిలిం. తెలుగు ఇండస్ట్రీకు మరో బలమైన హిట్ సినిమా వస్తుందని నమ్ముతున్నాను'' అని చెప్పారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ