Advertisementt

చిరు సినిమాలో తనకు క్రెడిట్ కావాలట!

Sat 30th Apr 2016 04:57 PM
chiranjeevi,150th film,vinayak,narasimharao  చిరు సినిమాలో తనకు క్రెడిట్ కావాలట!
చిరు సినిమాలో తనకు క్రెడిట్ కావాలట!
Advertisement
Ads by CJ

తమిళంలో ఘన విజయం సాధించిన 'కత్తి' సినిమాను మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని వి.వి.వినాయక్ డైరెక్ట్ చేస్తున్నారు. గత కొంతకాలంగా కత్తి సినిమా స్టోరీ తనదేనంటూ నరసింహారావు అనే రచయిత ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే అదే కథను చిరంజీవి రీమేక్ చేస్తుండడంతో ఈ వార్తకు మరింత హైప్ వచ్చింది. దీంతో దర్శకుడు వినాయక్, నరసింహారావుకి కొంత రెమ్యునరేషన్ ఇచ్చి సర్ది చెప్పినట్లు సమాచారం. అయితే నిన్న జరిగిన చిరు 150వ సినిమా ప్రారంభోత్సవ వేడుకకు నరసింహారావుని ఆహ్వానించలేదు. దీంతో టైటిల్స్ లో తనకు క్రెడిట్ ఇవ్వరేమో అని.. ఎట్టి పరిస్థితుల్లో స్క్రీన్ మీద రచయితగా తన పేరు రావాలని కోరుతున్నాడు. ఈ విషయంపై టీం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో మరోసారి ఆందోళనకు దిగుతానని చెబుతున్నారు. మరి వినాయక్ అండ్ టీం ఈ విషయంలో ఏం చేస్తుందో.. చూడాలి..!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ