Advertisementt

కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా..?

Fri 29th Apr 2016 07:25 PM
telangana cm kcr,biopic film,rudhramadevi  కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా..?
కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా..?
Advertisement
Ads by CJ

ఈ మధ్య కాలంలో నిజ జీవిత గాధలుగా వచ్చిన సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన 'రుద్రమదేవి','కిల్లింగ్ వీరప్పన్' వంటి బయోపిక్ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఇదే తరహాలో తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా కొందరు ఔత్సాహికులు సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గత రెండు సంవత్సరాల్లో కేసీఆర్ జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన ఘట్టాలను, తెలంగాణా రాష్ట్రం కోసం ఆయన చేసిన ఉద్యమాలను దృష్టిలో పెట్టుకొని ఒక కథగా మార్చి సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. కేసీఆర్ పాత్రలో ఎవరు నటిస్తున్నారనే విషయం తెలియాల్సివుంది. జూన్ 2న తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ సినిమా అధికార ప్రకటన చేయనున్నారని సమాచారం.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ