Advertisementt

అన‌సూయ ప్లేస్‌లో ట‌బు..!

Wed 27th Apr 2016 10:17 PM
tabu,tabu in hindi kshanam,tabu news,  అన‌సూయ ప్లేస్‌లో ట‌బు..!
అన‌సూయ ప్లేస్‌లో ట‌బు..!
Advertisement
Ads by CJ
కొంప‌దీసి జ‌బ‌ర్ద‌స్త్‌లో యాంక‌రింగ్ చేస్తున్న అన‌సూయ ప్లేస్‌లోకి ట‌బు వ‌స్తుందా ఏంటి అని కంగారు ప‌డిపోమాకండి. క్ష‌ణం సినిమాలో  అన‌సూయ చేసిన ఐపీయ‌స్ పాత్ర‌ని ట‌బుతో రీప్లేస్ చేయ‌బోతున్నారట‌. అదీ అస‌లు సంగ‌తి. క్ష‌ణం సినిమాని హిందీలో రీమేక్  చేస్తున్న విష‌యం తెలిసిందే. స‌ల్మాన్‌ఖాన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. ఒరిజిన‌ల్ వెర్ష‌న్‌లో  హీరోయిన్‌గా న‌టించిన ఆదాశ‌ర్మని హిందీలో కూడా కంటిన్యూ చేయ‌బోతున్నార‌ట‌. ఇక అన‌సూయ పోషించిన పాత్ర‌కి మాత్రం ట‌బు అయితేనే బాగుంటుంద‌ని చిత్ర‌బృందం భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ట‌బు దృశ్యం హిందీ రీమేక్‌లో కూడా ఐపీయ‌స్ అధికారిగా చ‌క్క‌టి అభిన‌యాన్ని ప్ర‌ద‌ర్శించింది. అందువ‌ల్లే క్ష‌ణంలో పాత్ర ఆమెని వ‌రించిన‌ట్టు  తెలుస్తోంది. నిజానికి తెలుగు క్ష‌ణంలో అన‌సూయ పోషించిన పాత్ర‌ని కూడా  మొద‌ట ట‌బుతోనే చేయించాల‌నుకొన్నార‌ట‌. కానీ రెమ్యున‌రేష‌న్ పెరిగిపోద్ద‌ని భావించిన చిత్ర‌బృందం అన‌సూయ‌తో బండి లాగించేసింది. కేవ‌లం కోటి రూపాయ‌ల‌తో తెర‌కెక్కిన ఆ చిత్రం భారీస్థాయిలో లాభాల్ని తెచ్చిపెట్టింది. హిందీలో కాస్త ఎక్కువ‌గానే బ‌డ్జెట్టు పెట్టి సినిమా తీయాల‌నుకుంటున్నారు. అందుకే మంచి క్యాస్టింగ్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. త్వ‌ర‌లోనే ఆ సినిమాకి సంబంధించి మ‌రిన్ని అప్‌డేట్స్ రాబోతున్నాయి. 
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ