Advertisement

ప్లీనరిలో నీటి గలగల..!

Wed 27th Apr 2016 07:53 PM
plenary,khammam,kcr,telangana,trs,chandrababu,mahanadu,water problem  ప్లీనరిలో నీటి గలగల..!
ప్లీనరిలో నీటి గలగల..!
Advertisement

తెలంగాణ మంచినీటి కరువుతో అల్లాడుతోంది. బుక్కెడు నీటికోసం మైళ్ళకొద్ది నడుస్తున్న అభాగ్యులు ప్రతి గ్రామంలో కనిపిస్తున్నారు. ఒక్కో చుక్కను ఒడిసిపట్టు అని నీటి పొదుపు గురించి పాలకులు చెబుతుంటారు. మరి అలాంటి పాలకులే లక్షలాది లీటర్ల నీటిని వృధా చేస్తే. సరిగ్గా  ఖమ్మంలో నిర్వహిస్తున్న తెరాస ప్లీనరీలో అదే జరుగుతోంది

నీటి కరవు కారణంగా క్రికెట్ పోటీల వేదికలే మారాయి. మంత్రి పర్యటన కోసం నీటిని వృధా చేస్తే విమర్శలు తప్పలేదు. లాతూర్ లో నీటి బాధలు తీర్చడానికి రైలు ట్యాంకర్ల ద్వారా నీటిని తరలిస్తున్నారు. దేశం మొత్తం మీద పరిస్థితి ఇంతదారణంగా ఉంటే, అధికార తెరాస పార్టీ ప్లీనరీ వేడికంటూ వేలాది ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించింది. వేదిక ప్రాంగణమంతటిని చల్లబర్చడానికి వందలాది ట్యాంకర్ల నీటిని చిమ్మారు. దుమ్ము లేవకుండా ఉండటం కోసం చుట్టుపక్కల నీటిని చల్లారు. ఇంకా అనేక విధాలుగా నీరు వృధా అవుతోంది. ఖమ్మం సైతం నీటి కటకటని ఎదుర్కొంటోంది. నీటి యుద్దాలు జరుగుతున్నాయి. మీడియా ద్వారా నీటి కష్టాల గురించి కథనాలు వెల్లడవుతున్నాయి. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిలో ప్లీనరీ జరపకుంటే నష్టమా అనే డౌట్ సామాన్యుడికి సైతం వస్తోంది. తెరాస అధికార పార్టీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిపాలిస్తోంది. పార్టీ ప్రతినిధులు నిత్యం అధినేతతో టచ్ లోనే ఉంటున్నారు. కాబట్టి ప్లీనరి అనేది అనవాయితే కానీ కంపల్సరీ కాదు. ఆటల పోటీలే వాయిదా వేసినపుడు, ప్లీనరీని వర్షాకాలంలో నిర్వహించుకునే అవకాశం ఉంది కదా అని ప్రజలు వాపోతున్నారు. 

మేలో తెదేపా కూడా మహానాడు పేరుతో హడావుడి చేయడానికి సన్నద్దమవుతోంది. ఆ పార్టీ కూడా నీటి కరువును గమనిస్తే మంచిది. అందరూ హర్షిస్తారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement