నాగ్ సినిమాలో మెగా హీరోయిన్!

Mon 25th Apr 2016 09:34 PM
pragya jaiswal,nagarjuna,raghavendrao  నాగ్ సినిమాలో మెగా హీరోయిన్!
నాగ్ సినిమాలో మెగా హీరోయిన్!
Sponsored links

'మిర్చిలాంటి కుర్రాడు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన నటి ప్రగ్య జైస్వాల్. మొదటి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ.. రెండో సినిమాకు మెగా హీరో వరుణ్ తేజ్ తో నటించే అవకాశం దక్కించుకుంది. 'కంచె' చిత్రంలో తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాకు మంచి హిట్ టాక్ వచ్చినా.. ప్రగ్యకు మాత్రం అవకాశాలు రాలేదు. అయితే సడెన్ గా అక్కినేని నాగార్జున సరసన నటించే ఛాన్స్ కొట్టేసిందీ భామ. నాగార్జున, రాఘవేంద్రరావుల కాంబినేషన్ లో హథిరామ్ బాబా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో నాగ్ సరసన హీరోయిన్ గా ప్రగ్యను సెలెక్ట్ చేసినట్లు సమాచారం. ఈ విషయంపై త్వరలోనే అధికార ప్రకటన రానుంది. రాఘవేంద్రరావు ప్రస్తుతం ఈ సినిమా కోసం లోకేషన్స్ ను వెతికే పనిలో ఉన్నారు. జూన్ నెలలో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.   

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019