Advertisement

బోయపాటి విలనిజం, సైలెన్స్ నుండి వయోలెన్స్

Mon 25th Apr 2016 03:13 PM
boyapati srinu,jagapathi babu,sarainodu  బోయపాటి విలనిజం, సైలెన్స్ నుండి వయోలెన్స్
బోయపాటి విలనిజం, సైలెన్స్ నుండి వయోలెన్స్
Advertisement

యువ హీరో ఆది పినిశెట్టిని సరైనోడు చిత్రానికి ప్రతినాయకుడిగా తీసుకోవడం వెనకాల దర్శకుడు బోయపాటి శ్రీను అభిరుచి, కథ అమరిక ముఖ్య కారణాలుగా ఉన్నాయి. మొదటగా ఈ పాత్రకు మాధవన్, వివేక్ ఒబెరాయ్ లాంటి పరభాషా నటులను అనుకున్నప్పటికీ వారు వేరువేరు కారణాల చేత అందుబాటులో లేకపోవడంతో ఆది వైపు మొగ్గారు. లెజెండ్ చిత్రంతో స్టార్ హీరోగా వెలుగొందిన జగపతి బాబును విలనీ వైపు ప్రస్థానాన్ని కొనసాగించేలా చేసిన బోయపాటి ఈసారి ఆదిలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. బోయపాటి సినిమాలు అనేసరికి విలనిజంలో ప్రత్యేక ఛాయలు అగుపడుతాయి. అందుకే లెజెండ్ జగపతి బాబుకి, సరైనోడు ఆదికి అసలు పోలికలు పెట్టి చూడడం తగదని బోయపాటి గారు పేర్కొంటున్నారు. 

లెజెండ్ సినిమాలో జగపతి బాబు పాత్ర చాలా లౌడుగా ఉంటుంది. ఆ పాత్ర అలా ఉంటేనే సరి. కానీ ఆదికి వచ్చేసరికి ఇతనొక యంగ్ ఆర్టిస్ట్. కాంటెంపరరీనెస్ కాపాడుతూ అతని క్యారెక్టర్ డిజైన్ ఉండాలి. అందుకే హీరో అల్లు అర్జున్ ఎదురుగా నిలబడేందుకు ఆది పాత్రని చాలా మటుకు సైలెంటుగా ఉంచెందుకే  ప్రయత్నించాం. ఎందుకంటే సైలెన్స్ నుండే అసలైన వయోలెన్స్ పుడుతుంది. ఈరోజు ఆదిని ప్రతినాయకుడిగా యాక్సెప్ట్ చేసారంటే అతని పాత్ర డిజైన్ నచ్చబట్టే జనాలు నచ్చుతున్నారు అని బోయపాటి చెప్పుకొచ్చారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement