Advertisementt

మెగా కొరత తీరుస్తాడా?

Sun 24th Apr 2016 07:28 AM
sai dharam tej,supreme release,24 release  మెగా కొరత తీరుస్తాడా?
మెగా కొరత తీరుస్తాడా?
Advertisement
Ads by CJ

వేసవి సీజన్ మొత్తం మెగా ఫ్యామిలీ సినిమాలతోనే నిండిపోయి ఇది మెగా వేసవి అయ్యేలా ఉంది. హిట్టు, ఫ్లాప్ అన్నవి పక్కన పెడితే మెగా అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఇలా వచ్చి అలా పోయినా 50 కోట్లు అవలీలగా వసూల్ చేసిందంటే అది మెగా పవర్. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ సరైనోడు కూడా విపరీతమైన ఎదురుదాడిని తట్టుకుంటూ ముందడుగు వేస్తోంది. ఈ రెంటి తరువాత సాయి ధరం తేజ్ సుప్రీం కూడా లైన్ లోకి వచ్చేసింది. మే మొదటి వారంలో మా సుప్రీం హీరో దిగబోతున్నాడు అంటూ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ అండ్ దర్శకుడు అనీల్ రావిపూడి అనౌన్స్ చేసారు. మే 6న సుప్రీంకి పోటీగా సూర్య 24 కూడా బరిలోకి దిగనుంది. సమ్మర్ మొత్తం వారానికో పెద్ద సినిమా అన్న సూత్రాన్నే ఫాలో అయిన నిర్మాతలు, బయ్యర్లు మరెందుకో గానీ మే 6న మాత్రం పై రెండు పోటీ పడాల్సిందే అంటున్నారు. ఇప్పటివరకు సమ్మర్లో పరిపూర్ణమైన హిట్టుకు నోచుకోని మెగా క్యాంపు హీరోల కొరతను సాయి ధరం తీరుస్తాడన్న ఆశ మెగా అభిమానుల్లో నెలకొంది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ